'విరోష్' హనీమూన్ ట్రిప్.. మొత్తం ప్రమోషనా?
అయితే తాజాగా విరోష్ జంట ఫారిన్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థాయ్ లాండ్ లోని కోహ్ సమూయ్ ప్రాంతంలో న్యూ కపుల్ గడిపిన సమయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;
సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. ముఖ్యంగా పెళ్లి, హనీమూన్ వంటి అంశాలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంట హనీమూన్ ట్రిప్ పై నెటిజన్లలో ఆసక్తికర చర్చ మొదలైంది. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోలను పోస్ట్ చేయడంతో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి.. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య విజయ్, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రిసెప్షన్, ఫ్యాన్స్ మీట్, ఆలయాల సందర్శన వంటి ఈవెంట్స్ తో సందడి చేశారు. చివరగా.. ఈరోజుతో సెలబ్రేషన్ ఎండ్ చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ కు వెళ్తున్నామని విజయ్ సరదాగా చెప్పారు.
అయితే తాజాగా విరోష్ జంట ఫారిన్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థాయ్ లాండ్ లోని కోహ్ సమూయ్ ప్రాంతంలో న్యూ కపుల్ గడిపిన సమయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనీమూన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ ట్రిప్ పై మరో యాంగిల్ లో చర్చలు కూడా మొదలయ్యాయి.
నెటిజన్లలో కొందరు విరోషన్ హనీమూన్ పూర్తిగా స్పాన్సర్డ్ ట్రిప్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా వారు ఉన్న లగ్జరీ ఎయిర్‌బీఎన్‌బీ రిసార్ట్, అక్కడి సౌకర్యాలు, సందర్శించిన ప్రదేశాలు.. వాటన్నింటినీ చూస్తుంటే బ్రాండ్ ప్రమోషన్స్ లా కనిపిస్తున్నాయని అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. వీడియోల్లో ఆ ప్రదేశాల ప్రత్యేకతలను హైలైట్ చేయడం వల్ల అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ట్రిప్ లను కూడా బ్రాండ్ ప్రమోషన్ తో లింక్ చేయడం సాధారణమైందని చెప్పాలి. ప్రముఖ రిసార్టులు, ట్రావెల్స్ సంస్థలు సెలబ్రిటీలను ఉపయోగించుకుని తమ సర్వీసులను ప్రచారం చేసుకోవడం ట్రెండ్ గా మారింది. అదే సమయంలో సెలబ్రిటీలకు లగ్జరీ అనుభవాలు పొందే అవకాశం కలుగుతోంది.
విజయ్- రష్మిక జంట విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వారి అప్డేట్లను అభిమానులు ఆసక్తిగా ఫాలో అవుతుండగా, కొందరు మాత్రం ప్రతి విషయాన్ని స్పాన్సర్ యాంగిల్ లో చూస్తున్నారు. అయితే మరోవైపు సెలబ్రిటీలకు ఇలాంటి సదుపాయాలు సహజమని, వారు ఎక్కడికి వెళ్లినా బ్రాండ్లు సంప్రదించడం కామన్ విషయమని మరి కొందరు నెటిజన్లు అంటున్నారు.
అంతేకాకుండా, తమ వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నిర్ణయించుకోవడం వారి ఇష్టమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా విరోష్ హనీమూన్ ట్రిప్ పూర్తిగా స్పాన్సర్డ్ కాదా అన్నది క్లారిటీ లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చర్చకు దారితీసింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై ఆసక్తి పెరుగుతున్న ఈ రోజుల్లో, ఇలాంటి ప్రచారాలు, చర్చలు కొనసాగడం మాత్రం సహజమే.