దేవర నాయక.. కింగ్ డమ్ ఎలా అయ్యింది..?

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్ డమ్ సినిమా థియేటర్ లో సందడి చేస్తుంది.;

Update: 2025-08-02 10:43 GMT

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్ డమ్ సినిమా థియేటర్ లో సందడి చేస్తుంది. రౌడీ ఫ్యాన్స్ సూపర్ డూపర్ అనేస్తున్న ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఐతే విజయ్ ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ అనిపిస్తుంది. కింగ్ డమ్ కమర్షియల్ మీటర్ లో చిత్ర యూనిట్ హిట్ అనే చెబుతున్నారు. కానీ ఆడియన్స్ రియాక్షన్ మాత్రం వేరేలా ఉంది. ఐతే కింగ్ డమ్ సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ, నాగ వంశీ.

జెర్సీ సినిమాలో రైల్వే స్టేషన్ సీన్ లానే..

లేటెస్ట్ గా ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ టైం లో సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు విజయ్. జెర్సీ సినిమాలో రైల్వే స్టేషన్ సీన్ లానే జైల్లో సీన్ కంపేర్ చేస్తున్నారన్న దానికి సమాధానం ఇస్తూ. తన అన్న తన దగ్గరకు రావాలి.. అతను వెళ్లకూడదు తనే దగ్గరకు రావాలి. అది ఎలా అందుకే కావాలని ఫైట్ చేస్తాడు.. ఇంకా రండి రా అంటూ అరుస్తాడు. అది కట్ చేశారు.. ఆ ఎమోషన్ లో అలా బిగ్గరగా అరుస్తాడు. దానికి జెర్సీ సీన్ కి ఎలాంటి సంబంధం లేదని అన్నాడు విజయ్.

ఇక ఇదే క్రమంలో కింగ్ డమ్ సీక్వెల్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కింగ్ డమ్ 2 ఉంటుంది.. అంతేకాదు కింగ్ డమ్ ప్రీక్వెల్ కూడా ఉంటుందని అన్నాడు. కింగ్ డమ్ లో 1920 స్టోరీ ఉంది కదా అది ప్రీక్వెల్ గా వస్తుందని అన్నారు విజయ్ దేవరకొండ. అంతేకాదు ముందు ఈ సినిమాకు దేవర నాయక అనే టైటిల్ అనుకున్నాం కానీ ఎన్టీఆర్ దేవర రావడం వల్ల అది కాస్త కింగ్ డం గా మార్చామని అన్నాడు విజయ్ దేవరకొండ.

కింగ్ డం ఒకటి రెండు కాదు ఏకంగా 3 సినిమాలు..

సో కింగ్ డమ్ ఒకటి రెండు కాదు ఏకంగా 3 సినిమాలన్న మాట. ఐతే రిలీజ్ ముందు గౌతమ్ తిన్ననూరిని ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయలేదు. ఆఫ్టర్ రిలీజ్ కూడా గౌతం ఎక్కడ కనిపించలేదు. మరి ఎందుకు గౌతమ్ సినిమా తీసి ఇలా ప్రేక్షకుల ముందుకు రాకుండా ఉంటున్నాడని ఆడియన్స్ అడుగుతున్నారు. కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమెకు తక్కువ సీన్స్ పడాయి. ఆమె ఉన్న హృదయం లోపల సాంగ్ కూడా లెంగ్త్ ఇష్యూ, సినిమా ఫ్లో మిస్ అవుతుందని లేపేశారు మేకర్స్.

Tags:    

Similar News