సూపర్‌ స్టార్‌ మూవీ అప్‌డేట్‌ ఇచ్చిన ముద్దుగుమ్మ!

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయగన్‌ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.;

Update: 2025-06-16 05:45 GMT
సూపర్‌ స్టార్‌ మూవీ అప్‌డేట్‌ ఇచ్చిన ముద్దుగుమ్మ!

తమిళ్ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయగన్‌ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజయ్‌ సినిమాలు సాధారణంగా చాలా స్పీడ్‌గా షూట్‌ చేస్తూ ఉంటారు. విజయ్‌ రాజకీయాలతో బిజీగా ఉంటున్న నేపథ్యంలో షూటింగ్‌కు ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నాడు. మరో ఒకటి రెండు షెడ్యూల్స్‌తో సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


'జన నాగయన్‌' సినిమా షూటింగ్‌ అప్డేట్‌ను హీరోయిన్‌ పూజా హెగ్డే ఇచ్చింది. ఈ అమ్మడు సినిమా షూటింగ్‌కు సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటించింది. జన నాయగన్‌ సినిమా తన పోర్షన్‌ పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చింది. షూటింగ్‌ పూర్తి చేసినట్లుగా చెప్పడంతో పాటు లవ్‌ ఈమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన తాను త్వరలోనే డబ్బింగ్‌ చెప్తాను అంటూ పేర్కొంది. ఈ సినిమా డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాపై పూజా హెడ్డే చాలా ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్‌లో ఆఫర్లు లేని ఈ అమ్మడు లక్కీగా కోలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

సూపర్‌ స్టార్‌ సినిమా కావడంతో పాటు, ఇది విజయ్‌కి అత్యంత కీలకమైన మూవీ కావడంతో జన నాయగన్ సినిమా హిట్‌ ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ముందు విజయ్ నుంచి ఈ సినిమా వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ షెడ్యూల్స్‌ లో విజయ్‌ తో పాటు ముఖ్యతారాగణం నటించబోతున్నారు. పూజా హెగ్డే పాత్ర ఇప్పటికే పూర్తి కావడంతో ఇతర పోర్షన్ అతి త్వరలోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టైలిష్ విలన్‌గా గుర్తింపు దక్కించుకున్న బాబీ డియోల్‌ నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో గౌతమ్‌ వాసు దేవ్ మీనన్‌, మమిత బైజు, ప్రియమణి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటిస్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు అనధికారిక రీమేక్‌. తమిళ నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్‌ ప్లేలో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా కథను కూడా పొలిటికల్‌ యాంగిల్‌లో మార్చారని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ ఇస్తామని దర్శకుడు హెచ్‌ వినోద్‌ ప్రకటించాడు. ఈ సినిమా హిట్ అయ్యి, పూజా హెగ్డే పాత్రకు మంచి స్పందన దక్కితే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News