• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తిలక్ వర్మతో దేవరకొండ...

తిలక్ వర్మతో దేవరకొండ పికిల్ బాల్.. స్పెషల్ రిక్వెస్ట్ కూడా...

| టీమ్ ఇండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ కీలక ప్లేయర్ తిలక్ వర్మ, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పికిల్ బాల్ ఆడి సందడి చేశారు.

By - Tupaki Desk
Update: 2025-05-06 05:32 GMT

టీమ్ ఇండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ కీలక ప్లేయర్ తిలక్ వర్మ, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పికిల్ బాల్ ఆడి సందడి చేశారు. స్పోర్ట్స్ ఔట్ ఫిట్స్ లో ఉన్న ఇద్దరూ, సరదాగా కనిపించారు. ఆ తర్వాత బెస్ట్ ఆఫ్ త్రీలో త‌న‌ను ఓడిస్తే ముంబయి ఇండియ‌న్స్ జెర్సీ వేసుకుంటాన‌ని తిల‌క్ వ‌ర్మ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ ఛాలెంజ్ విసిరారు.


అయితే పికిల్ బాల్ మ్యాచ్ లో 2-1తో విజయ్ టీమ్ గెలుపొందింది. అందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫుల్ వైరల్ గా మారింది. దీంతో టీమ్ ఇండియా క్రికెటర్స్, సినీ సెలబ్రిటీలు సహా పలువురు స్పందిస్తున్నారు. అదే సమయంలో విజయ్ కూడా కామెంట్ చేశారు.

తన అప్ కమింగ్ మూవీ కింగ్ డమ్ లోని హృదయం లోపల సాంగ్ కు రీల్ చేయాలని తిలక్ వర్మ, రాజంగడ్ ను కోరారు. తిలక్ కు లిరిక్స్ అర్థమవుతాయి కనుక అతడినే కొరియోగ్రాఫ్ చేయమని చెప్పారు. హైదరాబాద్ లో జరిగే ప్లేఆఫ్స్ కు వస్తానని, ముంబయి టీమ్ ను ఎంకరేజ్ చేస్తానని తెలిపారు.

అయతే ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో ముంబయి టీమ్.. దూసుకుపోతోంది. కాస్త ఆలస్యంగా పుంజుకున్నా.. వరుస మ్యాచుల్లో విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడగా.. లీగ్ దశలో మరో మూడు మ్యాచులు ఆడనుంది. అందులో కనీసం రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించినా ఫ్లేఆఫ్స్ కు వెళ్తోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం వాంఖడే స్డేడియంలో గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఇప్పుడు ఆ మ్యాచ్ కు ముందు తిలక్ వర్మతో కలిసి విజయ్ దేవరకొండ సరదాగా పికిల్ బాల్ ఆడాడు. అయితే దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సమ్మర్ కానుకగా మే 30న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మూవీ సూపర్ హిట్ అవుతుందని హోప్స్ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..

🍿𝗖𝗛𝗔𝗟𝗟𝗘𝗡𝗚𝗘 🤝 𝘼𝘾𝘾𝙀𝙋𝙏𝙀𝘿 😂#MumbaiIndians #PlayLikeMumbai | @TilakV9 @TheDeverakonda pic.twitter.com/y80ZqGbJzo

— Mumbai Indians (@mipaltan) May 5, 2025
Tags:    
  • VijayDeverakonda 
  • TilakVarma 
  • PickleballChallenge 
  • MumbaiIndians 
  • KingdomMovie 
  • IPL2025 
  • MIvsGT 
  • TollywoodMeetsCricket 
  • GautamTinnanuri 
  • TeluguCinema 
  • ViralVideo 
  • VijayInKingdom 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS