దేవరకొండ గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన జ్ఞాపకం అది!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన `టాక్సీవాలా` అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.;
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన `టాక్సీవాలా` అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచింది. సినిమా రిలీజ్ సమయంలో సినిమాపై అప్పటికే ప్రతికూల అంశాలు నెలకొన్నాయి. సినిమా పోవడం ఖాయమంటూ విపరీతమైన నెగివిటీ స్ప్రెడ్ అయింది.
విజయ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఇలా చేస్తున్నారనే విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అదే సమయంలో అల్లు అరవింద్ నీకు నేనున్నాంటూ అండగా నిలబడి ముందుకు రావడంతో? సీన్ మారింది. ఆ విషయంలో అరవింద్ కు ఎప్పటికీ విజయ్ రుణపడతాడు. దీనికి సంబంధించి అసలేం జరిగిందన్నది తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో విజయ్ పంచుకున్నాడు.` విడుదలకు ముందు అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ప్రాజెక్ట్‌ను వాయిదా వేస్తున్నాం .
మీ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని చెప్పారు. దీంతో నాలో ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో అర్దం కాలేదు. అల్లు అరవింద్ కోరిక మేరకు హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చాను. ఆ సమయంలో మొత్తం టీం ఆ ప్రాజెక్ట్ ని శాశ్వతంగా పక్కన పెట్టేయాలని అనుకున్నారు. ఔట్ పుట్ విషయంలో నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. సంగీతంపైనే అదే పరిస్థితి. సంగీతమంతా రోటీన్ గా ఉంది. అది సన్నివేశాలకు ఇబ్బందికరంగా మారింది. సినిమా అనుకున్న విధంగా రాలేదని తీవ్ర అసంతృప్తి కనిపించింది.
అప్పుడే అరవింద్ గారు సంగీతాన్ని సరిచేయమని సలహా ఇచ్చి వాళ్లను ఒప్పించారు. చెన్నైలో జేక్స్ బెజోయ్ ని నియమించారు. అతడే సంగీతానికి ప్రాణం పోసాడు. ఇంకా ఔట్ పుట్ విషయంలో చిన్న చిన్నమార్పులు చేసేసరికి అంతా సెట్ అయింది` అన్నారు. ఈ సినిమా పైరసీకి కూడా గురైంది. అయినా ఆ ప్రభావం ఎక్కడా సినిమాపై పడలేదు. సినిమా మంచి వసూళ్లను సాధించడంతో గ్రాండ్ గా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.