ఇదో గొప్ప ఛాన్స్.. ఐదేళ్ల తర్వాత స్టేజ్ పై తనలా : విజయ్ దేవరకొండ
దిల్ రాజు డ్రీమ్స్ ఇస్తున్న ఈ అవకాశాన్ని అందరు వాడుకోవాలని.. అందరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు విజయ్ దేవరకొండ.;

దిల్ రాజు మొదలు పెట్టిన దిల్ రాజు డ్రీమ్స్ కార్యక్రమం గురించి యూత్ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్ చేశారు. తను యాక్టర్ అవ్వాలనుకునే టైం లో ఐడియల్ బ్రెయిన్ సైట్ ఒక్కటే ఉండేది. ఆరు నెలలుగా ఉదయం నిద్రలేవగానే ఆ సైట్ చూసి ఈరోజు ఏదైనా ఆడిషన్ ఉందా అని చూడటమే పని అని.. ఒకరోజు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోసం ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ కావాలంటే ఆడిషన్ కి వెళ్లాం. ఆ ఆడిషన్ కు 60వేల మంది అప్లై చేస్తే చివరగా ఆ గ్యాంగ్ లో తనకు, నవీన్ పొలిశెట్టికి ఛాన్స్ వచ్చిందని అన్నారు విజయ్ దేవరకొండ.
సినిమాల్లోకి రావాలనుకునే వారికి దిల్ రాజు ఇలాంటి అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు విజయ్. ఈ ఈవెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరంతా సినిమాల్లోకి రావాలని కోరుతున్నా. మీలో ఏ ఒక్కరు సక్సెస్ అయినా కూడా దిల్ రాజు ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టే అని అన్నారు విజయ్ దేవరకొండ. సినిమాల్లోకి రావాలని ఉన్నా సరైన ఫ్లాట్ ఫాం దొరకని పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు మీడియా చాలా పెద్దదైంది.
దిల్ రాజు డ్రీమ్స్ ఇస్తున్న ఈ అవకాశాన్ని అందరు వాడుకోవాలని.. అందరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు విజయ్ దేవరకొండ. అంతేకాదు ఐదేళ్ల తర్వాత దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి అప్పుడు ఇదే స్టేజ్ మీద అతను మాట్లాడుతుంటే చూసి ఆనందించాలని ఉందని అన్నారు విజయ్ దేవరకొండ. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న దిల్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియచేశారు విజయ్ దేవరకొండ.
దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, దేవి శ్రీ ప్రసాద్ గెస్ట్ లుగా వచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలోనే రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్నారు. అంతకుముందు ఇదే బ్యానర్ లో ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేశారు విజయ్ దేవరకొండ. దిల్ రాజు డ్రీమ్స్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.