రౌడీ గ్లింప్స్‌కి గెట్ రెడీ బాయ్స్!
టీమ్ కూడా రౌడీ స్పీడులోనే షూటింగ్‌ని పూర్తి చేయాలని ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వర్క్ చేస్తోంది.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్లీ స్పీడు పెంచేశాడు. వరుస ఫ్లాపులు, తన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సవుతూ వస్తున్న విజయ్ సినిమాల విషయంలో రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. `కింగ్‌డమ్` తరువాత వరుసగా ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టి చక చకా వాటి షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవికిరణ్ కోల డైరెక్షన్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న రూరల్ అండ్ రస్టిక్ మూవీ `రౌడీ జనార్థన`లో నటిస్తున్నాడు.
ఈ మూవీలో రౌడీ స్టార్ సరికొత్త గెటప్‌లో, సరికొత్త మేనరిజమ్స్‌తో కనిపించనున్నాడట. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే పట్టాలెక్కించిన విజయ్ రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. `కింగ్‌డమ్` తరువాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా `రౌడీ జనార్థన`తో ప్రేక్షకుల్ని తనదైన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుకోవాలనే పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు.
టీమ్ కూడా రౌడీ స్పీడులోనే షూటింగ్‌ని పూర్తి చేయాలని ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వర్క్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ని వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రమోషన్స్‌ని కూడా అంతే స్పీడుగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. `కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..` అంటూ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేసిన విజయ్ దేవరకొండ మరోసారి తన స్వాగ్‌ని చూపించి బాక్సాఫీస్‌ని షేక్ చేయాలనుకుంటున్నాడట.
ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని డిసెంబర్ 18న భారీ స్థాయిలో మేకర్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కానీ గ్లింప్స్‌ని అధికారిక వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని, అది కూడా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో కాకుండా సింగిల్ స్క్రీన్స్‌లో రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ రిలీజ్ చేయనున్నారట.
నిర్మాత దిల్ రాజు బర్త్‌డే డిసెంబర్ 18. ఈ రోజునే గ్లింప్స్ రిలీజ్ డేట్‌ని అధికారికంగా టీమ్ ప్రకటించనున్నారని తెలిసింది. అంతే కాకుండా ఈ మూవీని వచ్చే ఏడాది దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.