రౌడీ దాగుడు మూతలాట ఎందుకో?
గత కొంత కాలంగా తన స్థాయి క్రేజ్‌కు తగ్గ సినిమాలని అందించలేకపోతున్న విజయ్ ..రవికిరణ్ కోలతో `రౌడీ జనార్ధన`, రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు. గత కొంత కాలంగా తన స్థాయి క్రేజ్‌కు తగ్గ సినిమాలని అందించలేకపోతున్న విజయ్ ..రవికిరణ్ కోలతో `రౌడీ జనార్ధన`, రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా విడుదల చేసిన `రౌడీ జనార్ధన` టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ కరుడు గట్టిన రౌడీగా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
గ్లింప్స్‌లో గోదావరి యాసలో విజయ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా షూటింగ్‌కు బ్రేక్ లభించడంతో విజయ్ దేవరకొండ హాలీడే ట్రిప్ కోసం రోమ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోదరుడు ఆనంద్ దేవరకొండ, స్నేహితులతో కలిసి రోమ్‌లో విహరిస్తున్న విజయ్ అక్కడి హిస్టారికల్ ప్లేస్‌లలో విహరిస్తూ దానికి సంబంధించిన ఫొటోగ్రాఫ్స్‌ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. `హ్యాపీ న్యూ ఇయర్ డార్లింగ్ లవ్స్.
మనం కలిసి పెరుగుదాం. గొప్ప జ్ఞాపకాలను ఏర్పరచుకుందాం. గొప్ప పనులు చేద్దాం. ప్రేమను ఉత్సాహాన్ని మరియు జీవితాన్ని పంచుకుందాం. మీ అందరికి అది పెద్ద ముద్దులు, కౌగిలింతలు` అని పోస్ట్ చేశాడు. అయితే విజయ్ షేర్ చేసిన ఈ ఫొటోల్లో కనిపిస్తున్న చేతులు, విజయ్ దేవరకొండ వెనకాల ఉండి అతన్ని పట్టుకుని కనిపిస్తున్న హ్యాండ్స్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఓ ఫొటోలో ఆనంద్ దేవరకొండతో పాటు కొంత మంది స్నేహితులు కనిపిస్తుండగా విజయ్ దేవరకొండని వెనక నుంచి కౌగిలించుకున్న రెండు చేతులు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చేతులు రష్మిక మందన్నవేనని, తను కూడా విజయ్ దేవరకొండతో కలిసి రోమ్‌లో పర్యటిస్తూ హాలీడే వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా విజయ్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని, ఇద్దరు త్వరలో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట ఆ విషయాన్ని మాత్రం ఇప్పటికీ ఓ ప్రైవేట్ ఈవెంట్ లాగే భావిస్తూ సీక్రెట్ మెయింటైన్ చేస్తోంది. ఇదిలా ఉంటే విజయ్‌తో కలిసి రష్మిక రోమ్‌లో పర్యటిస్తున్నారనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తడంతో వీరిపై సరికొత్త చర్చ జరుగుతోంది.
త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నా కానీ ఇటు విజయ్ దేవరకొండ, అటు రష్మిక మందన్న తమ బంధాన్ని బయటపెట్టకుండా ఇంఆక ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారో అర్థం కావడంలేదని వాపోతున్నారు. అందరికీ తెలిసిపోయినా ఇప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని, జరిగిన ఎంగేజ్‌మెంట్‌నీ రహస్యంగా ఉంచడం వెనకున్న మతలబ్ ఏంటని అభిమానులు, సినీ లవర్స్ వాపోతున్నారు.