భర్తపై రష్మిక ఎంత ప్రేమ చూపిస్తుందో..

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న సిల్వర్ స్క్రీన్ పై జోడీగా ఎంత పాపులర్ అయ్యారో.. రియల్ లైఫ్ లోనూ అంతే అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు.

Update: 2026-06-14 16:42 GMT

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న సిల్వర్ స్క్రీన్ పై జోడీగా ఎంత పాపులర్ అయ్యారో.. రియల్ లైఫ్ లోనూ అంతే అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ నాగర్‌ కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌ పేట గ్రామంలో ఆ జంట చేసిన సేవా కార్యక్రమం ఒకవైపు ప్రశంసలు అందుకుంటుండగా.. మరోవైపు ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

ఇటీవల తన వివాహ వేడుక సందర్భంగా సొంతూరికి ఏదో ఒక మంచి పని చేస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టాలెంట్ ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ భార్య రష్మికతో కలిసి తుమ్మన్‌ పేట గ్రామానికి వెళ్లి ప్రత్యేక స్కాలర్‌ షిప్ కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు.

'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో అచ్చంపేట మండల పరిధిలోని ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన 180 మందిని సెలెక్ట్ చేసి స్కాలర్ షిప్స్ అందించారు. విద్యలో రాణిస్తున్న ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల ఫ్యూచర్ కు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా విజయ్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థుల ఉన్నత చదువులకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఆ కార్యక్రమంలో స్కాలర్‌ షిప్‌ ల పంపిణీ ఎంత వైరల్ అయ్యిందో.. విజయ్-రష్మికల మధ్య చోటుచేసుకున్న చిన్న చిన్న మూమెంట్స్ కూడా అంతే వైరల్ అయ్యాయి. వేదికపై విద్యార్థులకు చెక్కులు అందజేస్తున్న సమయంలో విజయ్‌ కు చెమట పట్టగా.. రష్మిక ప్రేమగా కర్చీఫ్ ఇచ్చి తుడిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం, సరదాగా ఆట పట్టించుకోవడం అభిమానులకు మరింత దగ్గర చేసింది.

ముఖ్యంగా విజయ్ తన మీసాన్ని తిప్పుకుంటూ ఉండగా.. రష్మిక కూడా వెళ్లి ఆయన మీసాన్ని మెలేయడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అసలైన క్యూట్ కపుల్, స్టార్‌ డమ్ ఉన్నా నేచురాలిటీ మిస్ అవ్వలేదు, భర్తపై రష్మిక చూపించిన ప్రేమ ఎంతో ముద్దుగా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అయితే సేవా కార్యక్రమానికి వచ్చిన గ్రామస్థులు కూడా ఆ జోడీని ప్రశంసించారు. ప్రచారానికి పరిమితం కాకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం గ్రేట్ అని అన్నారు. ఆర్థిక పరిస్థితులు చదువుకు బ్రేక్ వేయకూడదనే ఆలోచనతో విద్యార్థులకు తోడుగా నిలవడం సూపర్ అంటూ అభిప్రాయపడ్డారు. తమ ప్రయాణానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో పంచుకున్న విజయ్.. "మా నాన్న పుట్టిన తుమ్మన్‌ పేట గ్రామంలో మేము కన్న ఒక చిన్న కల నెరవేరింది. తమ తల్లిదండ్రులను గర్వపడేలా చేసిన 180 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది" అంటూ ఎమోషనల్ అయ్యారు.

Tags:    

Similar News