దేవరకొండ సినిమా రెండు భాగాలా..?
ఐతే రాహుల్ సంకృత్యన్ విజయ్ దేవరకొండ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.;
విజయ్ దేవరకొండ కింగ్డం తర్వాత ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ మూవీ ఫిక్స్ చేసుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో కూడా మరో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా పీరియాడికల్ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది.
వీడీ 14వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. విజయ్, రష్మిక జోడీ ఇప్పటికే రెండు సినిమాల్లో నటించగా అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి అంచనాలను అందుకోలేదు. ఐతే ఈసారి రాహుల్ డైరెక్షన్ లో సినిమాతో వీరిద్దరు కలిసి బ్లాక్ బస్టర్ కొట్టాలన్ ఫిక్స్ అయ్యారు.
ఇదిలా ఉంటే రాహుల్ చెప్పిన కథకు విజయ్ దేవరకొండ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. ఫుల్ స్క్రిప్ట్ తో వీడీ చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాడట. ఐతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలనే ప్రపోజల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్య స్టార్ సినిమాలు రెండు భాగాలుగా చేసి ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.
బాహుబలి నుంచి మొదలైన ఈ పంథాని కొన్ని సినిమాలు కొనసాగిస్తున్నాయి. ఐతే రాహుల్ సంకృత్యన్ విజయ్ దేవరకొండ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. రాహుల్ తో ఆల్రెడీ టాక్సీవాలా సినిమా చేసిన అనుభవం ఉన్న విజయ్ దేవరకొండ తప్పకుండా వీడీ 14 తో ఒక రేంజ్ సక్సెస్ అందుకునే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే ఈ సినిమా టూ పార్ట్స్ గా వస్తుందా లేదా ఒక ప్రాజెక్ట్ గానే ముగిస్తారా అన్నది చూడాలి.
విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ మూవీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. రాహుల్ నానితో శ్యామ్ సింగ రాయ్ తర్వాత ఈ గ్యాప్ మొత్తం ఈ సినిమా కథ రాయడానికే తీసుకున్నారని తెలుస్తుంది. విజయ్ కి రాహుల్ టాక్సీవాలా హిట్ ఇచ్చాడు. ఈసారి పీరియాడికల్ కథతో ఈసారి అంతకుమించి అనిపించేలా చేయాలని చూస్తున్నాడు.