వాళ్లిద్ద‌రూ అన్న‌ద‌మ్ముల‌ని తెలీదు

ప్ర‌స్తుతం త‌న తాజా సినిమా కింగ్‌డ‌మ్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న విజ‌య్ దేవ‌రకొండ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.;

Update: 2025-07-25 21:30 GMT

ప్ర‌ముఖ న‌టుడు శివ కుమార్ వార‌సులుగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సూర్య‌, కార్తీ త‌మకంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏర్ప‌ర‌చుకున్నారు. ప్ర‌స్తుతం సూర్య‌, కార్తీ ఇద్ద‌రూ కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. ఆ ఇద్ద‌రు హీరోల‌కీ కేవ‌లం త‌మిళంలోనే కాకుండా అన్ని భాష‌ల్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నార‌నే విష‌యం తెలిసిందే.

న‌టులుగానే కాకుండా మంచి మ‌న‌సున్న హీరోలుగా ఎంతో మంచి పేరు తెచ్చ‌కున్న సూర్య‌, కార్తీ అంటే ప్ర‌తీ ఒక్క‌రికీ ఇష్ట‌మే. వారిద్ద‌రి మ‌ధ్య‌నున్న బాండింగ్ ఎంతో మందిని ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. చాలా మంది అన్న‌ద‌మ్ములు సూర్య‌, కార్తీ లా ఉండాల‌ని కోరుకుంటారు కూడా. ఇప్పుడ‌లానే ఓ టాలీవుడ్ సెల‌బ్రిటీ కూడా కోరుకున్న‌ట్టు తెలిపారు.

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకు సూర్య అంటే ఎంతో ఇష్ట‌మ‌నే విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌న తాజా సినిమా కింగ్‌డ‌మ్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న విజ‌య్ దేవ‌రకొండ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. త‌న త‌మ్ముడు ఆనంద్ ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని చెప్పిన‌ప్పుడు మ‌నిద్ద‌రం సూర్య‌, కార్తీలా ఉండాల‌ని చెప్పేవాడిన‌ని అన్నారు.

అదే ఇంట‌ర్వ్యూలో సూర్య, కార్తీ అన్న‌ద‌మ్ముల‌ని ముందు త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పి విజ‌య్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వారిద్ద‌రినీ చూస్తుంటే చాలా ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయ‌నిపించేద‌ని, ఈ విష‌యం త‌న ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర చెప్తే వాళ్లిద్ద‌రూ అన్న‌ద‌మ్ములని చెప్పార‌ని, కానీ తాను మాత్రం కాద‌ని వాదించాన‌ని, అప్పుడే అస‌లు విష‌యం తెలిసింద‌ని విజ‌య్ తెలిపారు. గ‌జినీ మూవీ చూసిన‌ప్ప‌టి నుంచి సూర్య‌కు ఫ్యాన్ గా మారిపోయాన‌ని చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆయ‌న యాక్టింగ్, డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయేవాడిన‌ని, సినిమాల్లోకి వ‌చ్చాక ఆయ‌న‌లా అవాల‌నుకున్నాన‌ని, చాలా సార్లు కార్తీ, సూర్య‌ను క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించాన‌ని విజ‌య్ వెల్ల‌డించారు.

ఇక కింగ్‌డమ్ విష‌యానికొస్తే వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం విజ‌య్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌ను మ‌రింత డబుల్ చేస్తూ నిర్మాత నాగ‌వంశీ ఈ సినిమా కెజిఎఫ్ స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ద‌ని హామీలిస్తున్నారు. భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించిన విష‌యం తెలిసిందే.

https://youtube.com/shorts/NjAPX1_jgBI?si=JkCyvHEFVnysEMRR

Tags:    

Similar News