కుర్చీ మడతపెట్టి.. ఆ వీడియోకు విజయ్ ఫిదా
తాజాగా ఓ వీడియోపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. ఆ వీడియో షేర్ చేస్తూ.. క్రేజీగా రాసుకొచ్చారు.;
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా స్పై జోనర్ లో రూపొందుతోంది. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ.. విజయ్ సరసన ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్న ఆ సినిమా.. జులై 31వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ కూడా క్రియేట్ చేశాయని చెప్పాలి.
రిలీజ్ కు మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో నాగవంశీ వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అదే సమయంలో రీసెంట్ గా స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అది విజయ్ అని అంతా అనుకున్నారు. కానీ అది ఆయన కాదని.. ఓ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియోగా తెలుస్తోంది.
తాజాగా ఓ వీడియోపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. ఆ వీడియో షేర్ చేస్తూ.. క్రేజీగా రాసుకొచ్చారు. ఏం తిని ఎడిట్ చేస్తున్నార్రా అంటూ పోస్ట్ పెట్టారు. మీరంతా వేరే లెవెల్ లో ఉన్నారని తెలిపారు. విజయ్ పోస్ట్ చేసిన వీడియో.. నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటోంది.
వీడియో ప్రకారం.. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్ లోని విజయ్ విజువల్స్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రూ.200 కోట్ల కొడతానన్న విజయ్ బైట్ ఉంది. అనంతరం విజయ్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కింగ్డమ్ గ్లింప్సెస్ లోని సీన్స్ వేరే లెవెల్. చివర్లో సినిమా రిలీజ్ కు 13 రోజులు అని వచ్చింది.
అయితే వీడియో అంతా ఒకెత్తు అయితే.. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన వాయిస్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళాక అమ్మ ఏడుస్తుంది.. చెప్పకుండా వెళ్లిందని చెప్పింది. డబ్బులు ఉన్నాయా లేవని చెప్పింది. వాళ్ల ఇంటికి వెళ్లగా మరదలు కుర్చీ వేసింది. అప్పుడే కుర్చీ మడతా పెడితే సాంగ్ ప్లే అయింది. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం రాగా.. పౌర్ణమి మూవీలోని క్లాసికల్ సాంగ్ వచ్చింది. ఓవరాల్ గా విజయ్ అన్నట్లు ఎడిటింగ్ మాత్రం వేరే లెవెల్. మీరు చూశారా?