కింగ్ డమ్ కి ఏ క్రెడిట్ వచ్చినా అతనికే..!
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. యూఎస్ ప్రీమియర్స్ ఈరోజు నైట్ పడుతున్నాయి;
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. యూఎస్ ప్రీమియర్స్ ఈరోజు నైట్ పడుతున్నాయి. సినిమాపై అన్నిచోట్ల భారీ హైప్ ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ ఉన్నా కూడా ఈరోజు కింగ్ డమ్ టీం ప్రెస్ మీట్ పెట్టారు. సినిమాపై మరోసారి ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఏ క్రెడిట్ వచ్చినా అది దర్శకుడికే..
సినిమా గురించి వీడీ ఇప్పటికే చాలా చెప్పాడు. ఐతే లేటెస్ట్ ప్రెస్ మీట్ లో ఒక సినిమాకు డైరెక్టర్ అనే వాడే అన్నిటికీ మూలమని అన్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎవరి డ్యూటీస్ వాళ్లు చేసి వెళ్తారు. కానీ అందరినీ బ్యాలెన్స్ చేస్తూ వాళ్లని చూసుకునేది దర్శకుడు మాత్రమే. అందుకే సినిమాకు ఏ క్రెడిట్ వచ్చినా అది దర్శకుడికే అని అన్నాడు విజయ్ దేవరకొండ.
అర్జున్ రెడ్డికి వచ్చిన క్రెడిట్ సందీప్ వంగాది.. గీతా గోవిందం కి వచ్చిన క్రెడిట్ బుజ్జికి.. కింగ్ డం కి వచ్చే క్రెడిట్ గౌతమ్ తిన్ననూరికే అన్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తో పాటు సినిమాకు కాంట్రిబ్యూట్ చేసిన అనిరుద్, నవీన్ నూలి ఇలా అందరు తమ బాధ్యత నిర్వర్తించారని అన్నాడు విజయ్ దేవరకొండ.
పెద్ద హీరో క్యామియో రోల్ ..
ఇదే ప్రెస్ మీట్ లో ట్రైలర్ చివర్లో మాస్క్ తో కనిపించింది ఎవరు.. మేము పెద్ద హీరోని ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని అడిగితే.. విజయ్ దేవరకొండ దానికి ఆన్సర్ ఇస్తూ అవును పెద్ద హీరోనే అనేశాడు. సో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ లో పెద్ద హీరో క్యామియో రోల్ ఉంటుందా అనే ఎగ్జైట్ మెంట్ మొదలైంది.
ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ చాలా కామ్ అండ్ కంపోజ్ గా ఉన్నాడు. ఎక్కడ తన పాత పద్ధతి ఫాలో అవ్వలేదు. సినిమా మీద విజయ్ ఐతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి జెర్సీ తర్వాత చేస్తున్న సినిమాగా కింగ్ డం మీద భారీ హైప్ ఉంది. మరి ఈ సినిమా ఏమేరకు ఆ అంచనాలను అందుకుంటుందో చూడాలి. కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా కింగ్ డం కి బాగా కలిసి వచ్చేలా ఉంది.