కింగ్ డమ్ 2 ఈ ట్విస్ట్ ఏంటో..?
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిలీజైంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా విజయ్ యాక్టింగ్ గురించి చెబుతున్నారు.;
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిలీజైంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా విజయ్ యాక్టింగ్ గురించి చెబుతున్నారు. సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకోగా జెర్సీ తీసిన గౌతం ఇంత లార్గ్ స్కేల్ లో సినిమా తీస్తాడని మాత్రం ఊహించలేదని చెప్పుకుంటున్నారు. ఐతే కింగ్ డమ్ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ కి కావాల్సిన లీడ్ ఇచ్చాడు డైరెక్టర్ గౌతం తిన్ననూరి. ఐతే అన్ని సినిమాల్లా ఎండ్ కార్డ్ లో పార్ట్ 2 అని వేయలేదు. కానీ కథ కొనసాగుతుంది అన్నట్టు హింట్ ఇచ్చాడు.
కింగ్ డమ్ 2 కథ ఏంటి..?
సినిమా ప్రమోషన్స్ లో కూడా నిర్మాత నాగ వంశీ కింగ్ డమ్ కథ కొనసాగుతుంది. అది చూస్తేనే అర్ధమవుతుంది అన్నాడు. ఇక కథ ప్రకారం చూస్తే తన ప్రజలను కాపాడటానికి మళ్లీ వచ్చిన నాయకుడిగా సూరి నెక్స్ట్ ఏం చేస్తాడు. తండ్రి, తమ్ముడు మురుగన్ ని కోల్పోయిన సేతు ఫారిన్ నుంచి వచ్చాడు. నెక్స్ట్ వాళ్ల ఆపరేషన్ ఏంటి.. యుద్ధం ఎలా ఉండబోతుంది అన్నది కింగ్ డమ్ 2 కథ.
ఐతే కింగ్ డమ్ 2 అని టైటిల్ కార్డ్ వేయకుండా జస్ట్ కథతోనే ఇది ముగింపు కాదు కొనసాగింపు అనే ఆలోచన వచ్చేలా చేశారు. పార్ట్ 2 ఎలా ఉంటుంది అన్న హింట్ ఇస్తూ మరో రెండున్నర గంటల సినిమా నడిచే సరుకంతా రెడీ చేశాడు డైరెక్టర్ గౌతం తిన్ననూరి. ఐతే ఇలా ఒక సినిమా ముగింపులో పార్ట్ 2 అనే పోస్టర్ కూడా వేయకుండా నడిపించడం సంథింగ్ స్పెషల్ అనిపించింది. డిఫరెంట్ గా ఉంది. తప్పకుండా కింగ్ డం పార్ట్ 2 కూడా గౌతం మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.
ఒకే సినిమాగా చెప్పలేరా..
ఐతే ఈ కథను ఒకే సినిమాగా చెప్పలేరా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకు కావాలని సినిమాను ల్యాగ్ చేసి మరో పార్ట్ పెట్టడం అన్నట్టుగా చెబుతున్నారు. ఐతే హీరో ఎలివేషన్స్, కథ లో ఉన్న ఫీల్ ఆడియన్స్ కు రీచ్ అవ్వాలంటే ఈమాత్రం ఉండాలంటున్నారు. ఐతే అదేమో ఒక సినిమాగా అవ్వాల్సింది రెండు భాగాలు ఇంకా చాలదు అంటే మూడో పార్ట్ కూడా చేస్తున్నారు. ఇందులో స్టార్ ఇమేజ్ తాలూకా కమర్షియల్ అంశాలు కూడా తోడవడం వల్ల ఇలా సినిమాలు ప్రీక్వెల్స్, సీక్వెల్స్ అంటూ చేస్తున్నారు.