కలెక్షన్స్ పోస్టర్స్.. నాగవంశీ ఊహించని సెటైర్!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకోవడానికి ‘కింగ్‌డమ్’ సినిమా కట్టుదిట్టంగా రెడీ అవుతోంది.;
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకోవడానికి ‘కింగ్‌డమ్’ సినిమా కట్టుదిట్టంగా రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలకు ముహూర్తం సమీపించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్ దేవరకొండకు హిట్ అవసరమైన టైమింగ్‌లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ హైప్ గట్టిగానే ఉంది.
హైప్ అండ్ క్యాస్ట్
విజయ్ దేవరకొండతో పాటు, ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. యంగ్ హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా బజ్ మార్కెట్‌లో బాగా ఏర్పడింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ను అందించడంతో యువతలో ఆసక్తి మరింత పెరిగింది. ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా కింగ్‌డమ్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ ఇద్దరూ కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొని, మీడియాతో మాట్లాడారు.
కలెక్షన్స్ పోస్టర్స్‌పై నాగవంశీ సెటైర్
ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం కలెక్షన్ల పోస్టర్లు. మీడియా ఇంటర్వ్యూలో నాగవంశీని, “ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వస్తుందనుకుంటున్నారు? ఎన్ని కోట్ల వసూళ్లు?” అని అడిగారు. దీనికి ఆయన "కలెక్షన్ పోస్టర్‌దేముంది, ఎంత కావాలంటే అంత వేసుకుందాం" అని చెప్పి అందరినీ నవ్వించారు. ఇండస్ట్రీలో కలెక్షన్ల పోస్టర్స్‌ను ఎవరికి వారే ఇష్టం ఉన్నట్లు వేసుకోవడం, వాస్తవికంగా కాకుండా పెద్ద సంఖ్యలో చూపించడంపై నాగవంశీ తనదైన సెటైర్ వేశాడు. మంచి ఓపెనింగ్ రావడం ఇప్పటి సినిమాలకు పెద్ద సవాలని, కానీ తమ సినిమా విషయంలో మంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి అని తెలిపారు.
కథ.. క్యూరియాసిటీ పెంచే ట్రైలర్
కింగ్‌డమ్ ట్రైలర్‌లో కథను ఎక్కువగా రివీల్ చేయకపోవడం గురించి మాట్లాడుతూ, ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచడమే ప్రధాన ఉద్దేశమన్నారు నాగవంశీ. టీజర్ ద్వారా అంచనాలు పెంచడం కన్నా, థియేటర్‌లోకి వెళ్ళాక ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలన్నదే తమ టార్గెట్ అని తెలిపారు. “తన అన్నను కాపాడేందుకు హీరో ఎంత వరకు వెళతాడు?” అన్నదే సినిమా మెయిన్ పాయింట్. మొదటి పది నిమిషాల తర్వాత టైటిల్ వెనుక అసలు కథ తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు.
శ్రీలంక బ్యాక్ డ్రాప్.. ట్రెండ్ సెట్ చేసే కింగ్‌డమ్
ఈ సినిమాకు శ్రీలంక నేపథ్య సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నాగవంశీ పేర్కొన్నారు. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాగా అద్భుతంగా రూపొందించామన్నారు. “సినిమా మొదలైన తరువాతే కింగ్‌డమ్ అనే టైటిల్‌కు అర్థం తెలుస్తుంది. ప్రేక్షకులు పూర్తి అనుభూతిని పొందేలా రూపొందించాం” అని తెలిపారు. ఫ్యాన్స్, ఆడియన్స్ లలో అంచనాలు కింగ్‌డమ్ మీద పీక్‌లో ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మరి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా? ఫస్ట్ డే కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.