కింగ్డమ్‌ కు పవర్ఫుల్ బూస్ట్ ఇచ్చిన అనిరుద్

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుద్ తన లైవ్ పెర్ఫార్మెన్స్ తో అభిమానుల్ని మరింత ఎట్రాక్ట్ చేశాడు.;

Update: 2025-07-29 08:04 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ కింగ్డమ్ సినిమా ఇప్పటికే ఊహించని స్థాయిలో హైప్‌ను సొంతం చేసుకుంది. ట్రైలర్ తో హై ఎమోషన్ యాక్షన్ కలిపిన మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మితమైన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించడంతో యూత్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుద్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ పై మాస్ హైప్ క్రియేట్ చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుద్ తన లైవ్ పెర్ఫార్మెన్స్ తో అభిమానుల్ని మరింత ఎట్రాక్ట్ చేశాడు. రాగిలే రాగిలే అనే మాస్ ఎలివేషన్ సాంగ్‌ను స్టేజ్ పై తానే స్వయంగా పాడి ప్రోగ్రామ్‌ని ఎనర్జిటిక్‌గా మార్చాడు. క్రిష్ణకాంత్ రచించిన ఈ పాటను సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. సినిమాలోని ప్రధాన పాత్రను, కథను ఎలివేట్ చేసే విధంగా మ్యూజిక్‌ను అనిరుద్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్ యాంగిల్‌తో పాట మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సాంగ్ విజయంతో సినిమా మీద కొత్త హైప్

ఈ రాగిలే రాగిలే సాంగ్ ప్రీమియర్ తర్వాత సినిమా మీద నెట్టింట్లో మరో స్థాయిలో హైప్ పెరిగింది. అనిరుద్ గతంలో హుకుమ్, ఫియర్ సాంగ్‌లను సూపర్‌హిట్ చేసి, ఆ పాటలు ఎలా ప్లే లిస్టుల్లో ట్రెండ్ అయ్యాయో, అలాగే ఈ సాంగ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలవబోతోందన్న టాక్ వస్తోంది. ఈ పాట సినిమాలో కూడా ఒక కీలక టైమ్‌లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అనిరుద్ రివ్యూ మరో లెవెల్ కాన్ఫిడెన్స్

ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుద్ ఇచ్చిన రివ్యూ కూడా ఫ్యాన్స్ లో అదిరిపోయే కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ తమ అందరి కెరీర్‌లో ప్రత్యేక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనే చెప్పాడు. అలాగే నిర్మాత నాగవంశీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని అలాంటి ప్రొడ్యూసర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా సినిమాకు బెస్ట్ వర్క్ ఇచ్చారని కింగ్డమ్ అందరికి నచ్చుతుందని అన్నారు. అనిరుద్ ఉత్సాహాన్ని చూస్తే కింగ్డమ్ మ్యూజికల్ హిట్ కావడం ఖాయమనే నమ్మకం రిఫ్లెక్ట్ అవుతోంది.

మరికొన్ని గంటల్లో కింగ్డమ్ హవా

మొత్తానికి కింగ్డమ్ మూవీ జూలై 31న గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా, ఇప్పటికే పాటలు, ట్రైలర్, ప్రమోషన్లతో భారీగా అంచనాలు పెంచుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇచ్చిన హై ఎనర్జీ మ్యూజిక్, హీరో విజయ్ కొత్తగా ట్రై చేసిన మాస్ లుక్, భాగ్యశ్రీ బోర్సేకి ఇది మంచి లాంచ్ అవుతుందనే టాక్‌ తో సినిమా మీద ఆసక్తి టాప్ లెవెల్‌కు వెళ్లిపోయింది. ఇక రాగిలే రాగిలే సాంగ్ కు థియేటర్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News