రౌడీ జనార్దన్ 6 నెలలు టార్గెట్..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ని ఈ నెల చివరి కల్లా రిలీజ్ చేసేందుకు కృషి చేస్తున్నాడు.;

Update: 2025-05-08 03:00 GMT

విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ని ఈ నెల చివరి కల్లా రిలీజ్ చేసేందుకు కృషి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రౌడీ జనార్ధన్ అని రాబోతున్నాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఐతే ఈ సినిమాను AI టెక్నాలజీని ఉపయోగించి భారీ ప్లానింగ్ తో వస్తున్నారు.

రౌడీ జనార్ధన్ సినిమాను దిల్ రాజు ఒక టార్గెట్ పెట్టుకుని మరీ పూర్తి చేసేలా చూస్తున్నారట. సినిమాను 6 నెలల్లో పూర్తి చేసేలా పర్ఫెక్ట్ షెడ్యూల్ ని సిద్ధం చేశారట. ఈమధ్య పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఏడాదిలో పూర్తి చేయాలని మొదలు పెట్టి రెండేళ్ల దాకా లాగిస్తున్నారు. అంతేకాదు అనుకున్న రిలీజ్ డేట్ కి సినిమాను తీసుకు రావట్లేదు.

కానీ దిల్ రాజు మాత్రం రౌడీ జనార్ధన్ విషయంలో అలా కాకుండా ముందు నుంచి జాగ్రత్త పడేలా చూస్తున్నాడు. రౌడీ జనార్ధన్ సినిమా అనౌన్స్ మెంట్ తోనే కత్తి నాదే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ ఒక క్రేజీ పోస్టర్ వదిలారు. ఆల్రెడీ కింగ్ డం తో భారీ అటెంప్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ రాబోతున్న రౌడీ జనార్ధన్ తో కూడా గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నాడని అర్థమవుతుంది.

రౌడీ జనార్ధన్ సినిమా కథ కూడా అద్భుతంగా వచ్చిందట. అందుకే సినిమా విషయంలో దిల్ రాజు నో కాంప్రమైజ్ అనేలా ప్లాన్ చేస్తున్నాడట. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో కూడా సినిమా లైన్ లో పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా పీరియాడికల్ కథతో రాబోతుందని తెలుస్తుంది. విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా తన సినిమాల ప్లానింగ్ చూసి సూపర్ అనేస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో విజయ్ తన నెక్స్ట్ సినిమాలతో ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే క్రేజీ సినిమాలు లైన్ లో పెట్టాడు. తప్పకుండా ఈ సినిమాలు రౌడీ ఫ్యాన్స్ కి మంచి జోష్ అందించేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఒక మాస్ హిట్ కొడితే చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ ముందు సూపర్ బజ్ ఏర్పడుతున్నా కూడా కమర్షియల్ గా ఫెయిల్ అవుతున్నాయి. ఐతే రాబోతున్న సినిమాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉన్నాయి.

Tags:    

Similar News