విజయ్ దేవరకొండ డ్యూయెల్ రోల్!
ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడుట.;
విజయ్ దేవరకొండ 13వ చిత్రం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 1854-78 మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆసక్తికర స్టోరీ ఇది. ఇందులో విజయ్ శక్తి వంతమైన యోధుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇంతవరకూ విజయ్ ఇలాంటి పాత్ర పోషించలేదు. దీంతో ఆ పాత్రకు సంబంధించి ప్రత్యేకమైన హార్స్ రైడింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుం టున్నాడు.
విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయింది. పాత్రకు సంబంధించి రష్మిక కూడా ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇటీవల కాలంలో విజయ్-రష్మిక జంటగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ లో భాగంగా ఇద్దరు స్పెషల్ ట్రైనింగ్ కు హాజరువుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగు తున్నాయి.
ఈ సినిమాపై రాహుల్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడుట. అందులో ఓ పాత్ర యోదుఢిగా ఉంటుందని ఇది ప్లాష్ బ్యాక్ లో వస్తుందిట. మరో రోల్ నెటి జనరేషన్ కు లింక్ అయి ఉంటుందిట. ఈ రెండు పాత్రల చుట్టూన ప్రధాన కథ తిరగుతుందిట. విజయ్ ఇంతవరకూ ఒకేసారి రెండు పాత్రలు ఏ సినిమాలోనూ పోషించలేదు.
అతడికిది కొత్త ఎక్స్ పీరియన్స్ అవుతుంది. దీంతో ఆ పాత్రలు ఎలా ఉంటాయి? అన్న క్యూరియాసిటీ మొదలైంది. అలాగే సినిమా కోసం భారీ ఎత్తున సెట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయట. ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న కింగ్ డమ్ వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. అనంతరం విజయ్ ప్రీ అవుతాడు. దీంతో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.