• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతనికి మరో బిచ్చగాడు...

అతనికి మరో బిచ్చగాడు దొరకాలి..!

| కోలీవుడ్ లో విజయ్ ఆంటొని తీస్తున్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అతను నటించిన పిచ్చైకారన్ అదే తెలుగులో బిచ్చగాడు గా రిలీజై సంచలన విజయం అందుకుంది.

By - Tupaki Desk
Update: 2025-06-02 02:30 GMT

కోలీవుడ్ లో విజయ్ ఆంటొని తీస్తున్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అతను నటించిన పిచ్చైకారన్ అదే తెలుగులో బిచ్చగాడు గా రిలీజై సంచలన విజయం అందుకుంది. తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా నేరుగా 100 రోజులు ఆడటం చాలా ఏళ్ల తర్వాత బిచ్చగాడు సృష్టించిన సంచలన రికార్డ్ ఉంది. విజయ్ ఆంటోని హీరోగా శశి డైరెక్షన్ లో తెరకెక్కించ్ బిచ్చగాడు సినిమా అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

బిలీనియర్ అయిన హీరో తల్లి కోసం బిచ్చగాడిగా మారిన కథ ఆ కథను నడిపించిన కథనం అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా ఎక్కేశాయి. సెంటిమెంట్ సినిమాలను బాగా ఎంకరేజ్ చేసే తెలుగు వాళ్లకు బిచ్చగాడు సినిమా బాగా నచ్చింది. అందులోనూ మదర్ సెంటిమెంట్ అవ్వడంతో బిచ్చగాడు రికార్డులు సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన హై తోనే విజయ్ ఆంటోని పాత సినిమాలకు క్రేజ్ పెరిగింది. వరుసగా వాటిని డబ్ చేసి రిలీజ్ చేశారు.

ఇక బిచ్చగాడు తర్వాత తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ ఆంటోని వరుసగా తన సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ వచ్చాడు. బేతాళుడు, బిచ్చగాడు 2 తప్ప మిగతా సినిమాలన్నీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఐతే విజయ్ ఆంటోని కెరీర్ లో మరో బిచ్చగాడు కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి ఒక సూపర్ హిట్ పడితే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చని అనుకుంటున్నాడు .

బిచ్చగాడు 2 తర్వాత తీస్తే మళ్లీ బిచ్చగాడు 3 తీయాలి. ఐతే టైటిల్ పెట్టినంత ఈజీగా కథ కుదరదు. అందుకే బిచ్చగాడు టైటిల్ కి సరిగా కుదిరే కథ కోసం వెతుకుతున్నారట. విజయ్ ఆంటోని ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. సరైన కథ కథనాలు కుదిరితే మాత్రం బిచ్చగాడు వల్ల వచ్చిన ఇమేజ్ తో విజయ్ ఆంటోని తప్పకుండా తిరిగి తెలుగులో ఫాంలోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు విజయ్ ఆంటోనితో తెలుగు స్ట్రైట్ సినిమా చేసినా సరే ఆయనకు ఉన్న మార్కెట్ కి వర్క్ అవుట్ అవుతుంది. మరి మన దర్శకులు ఎవరు అలాంటి అటెంప్ట్ చేయాలన్న ఆలోచన రావడం లేదెందుకో అర్ధం కావట్లేదు. ఏది ఏమైనా విజయ్ ఆంటోని మరో మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలని ఆడియన్స్ కోరుతున్నారు.

Tags:    
  • VijayAntony 
  • Bichagadu 
  • KollywoodStar 
  • Bichagadu3 
  • TeluguCinema 
  • SouthIndianCinema 
  • BlockbusterHit 
  • MotherSentiment 
  • TollywoodBuzz 
  • Filmindustry 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS