ఆ ఫ్రాంచైజ్‌కు అతను కరెక్ట్ ఛాయిసేనా?
ఛావా సినిమాతో విక్కీ కౌశల్ ఎంత పెద్ద సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఛావా సక్సెస్ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ త్వరలో విక్కీ కౌశల్ ను తమ స్పై యూనివర్స్ లోకి తీసుకురావాలని ప్రయత్నస్తున్నట్టు తెలుస్తోంది.;

ఛావా సినిమాతో విక్కీ కౌశల్ ఎంత పెద్ద సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఛావా సక్సెస్ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ త్వరలో విక్కీ కౌశల్ ను తమ స్పై యూనివర్స్ లోకి తీసుకురావాలని ప్రయత్నస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్ లో రానున్న థ్రిల్లర్ లో భాగమవడానికి విక్కీ కౌశల్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఇదే నిజమైతే విక్కీ కౌశల్ స్పై యూనివర్స్ లో ఐదో యాక్టర్ అవుతాడు. టైగర్ గా సల్మాన్ ఖాన్, పఠాన్ గా షారుఖ్, కబీర్ గా హృతిక్ రోషన్, ఆల్ఫాగా అలియా భట్ తర్వాతి స్థానంలో ఇప్పుడు విక్కీ కౌశల్ చేరతాడు. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం విక్కీ కౌశల్ ఈ ఫ్రాంచైజ్ లో చేరడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే యాక్షన్ సినిమాల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న కౌశల్ అయితే ఈ స్పై యూనివర్స్ సినిమాకు సరిగ్గా సరిపోతాడని యష్ రాజ్ ఫిల్మ్స్ భావిస్తోంది.
ఈ స్పై యూనివర్స్ లోకి విక్కీ కౌశల్ ను తీసుకోవడమనేది ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ఇప్పటికే ఆ ఫ్రాంచైజ్ మంచి సంతృప్తిని సాధించిందని భావిస్తున్నారు. మెయిన్ లీడ్ గా నటించే వారు సిరీస్ కు ఫ్రెష్ ఫీల్ తీసుకురాలేకపోతే విక్కీ కూడా దాన్ని పునరుద్ధరించలేడని అంటుంటే, మరికొందరు మాత్రం రణ్‌బీర్ కపూర్ కంటే విక్కీ కౌశలే మంచి ఛాయిస్ అంటున్నారు.
ఇంకొందరు మాత్రం స్పైవర్స్ సినిమాలన్నీ ఒకేలా అనిపిస్తున్నాయని, హీరో లేదా విలన్ పాత్రలు మాత్రమే మారుతున్నాయని అంటున్నారు. కేవలం కొత్త నటుడు స్పైవర్స్ ఫ్రాంచైజ్ ను కాపాడలేడని, మంచి రైటర్ అయితేనే ఫ్రాంచైజ్ నిలబడుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఛావా సినిమా కూడా విక్కీ కౌశల్ యాక్టింగ్ వల్ల ఆడలేదని, అది కేవలం మతపరమైన సెంటిమెంట్, సినిమాలోని కంటెంట్ వల్లే ఆడిందని క్రిటిక్స్ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ ఫ్రాంచైజ్ కు కొత్త నటులను తీసుకునే దానికి బదులు మంచి కథపై వర్క్ చేస్తే బావుంటుంది.