LCU లా VCU ఈసారి డబుల్ బొనాంజా!
ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి మరో డైరెక్టర్ కూడా యూనివర్శ్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.;
కోలీవుడ్ లో సినిమాటిక్ యూనివర్శ్ కు సృష్టికర్త లోకేష్ కనగరాజ్. యూనివర్శ్ అనే ట్రెండ్ ని పరిచయం చేసింది కనగరాజే. ఒక సినిమాతో మరో సినిమాకు లింకప్ చేసి కంటున్యూ గా ఆరేడు సినిమాలు చేయడం అన్నది లోకేష్ యూనివర్శ్ లో భాగం. అందులో కథలు మారుతుంటాయి. కానీ నేపథ్యం మారుదు. అలాగే హీరోలు మారుతుంటారు. అవసరమైతే మొదటి భాగంలో నటించిన హీరో రెండవ భాగంలో మరో పాత్రలో నూ కనిపించే అవకాశం ఉంటుంది.
అదంతా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఉంటుంది. ఎల్ సీయూ నుంచే టాలీవుడ్ లో యూనివర్శ్ ట్రెండ్ మొదలైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ పేరిట ఓ యూనివర్శ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాత నాగవంశీ కూడా కూడా `డీజేటిల్లు-మ్యాడ్` చిత్రాలను కలుపుతూ ఓ యూనివర్శ్ కిందకు తీసుకొచ్చి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి యూనివర్శ్ లు మిరన్ని రావడం ఖాయం.
ఈ నేపథ్యంలో కోలీవుడ్ నుంచి మరో డైరెక్టర్ కూడా యూనివర్శ్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడే వెట్రీ మారన్. కోలీవుడ్ లో ఇతడి సక్సెస్ రేట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నారు. తన సినిమాల ద్వారా మంచి సందేశాన్నందిచడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికే శింబుతో ఓ సినిమాకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాతో వెట్రీమారన్ వీసీయూ ను పరిచయం చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఉత్తర చెన్నై నేప థ్యంలో శింబుతో సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో `వడచెన్నై ` కథకు. ..తాజా కథను లింక్ చేస్తూ శింబుతో సినిమాకు రెడీ అవుతున్నారుట. అలాగే వెట్రీమారన్ పాత సినిమా కథల నేపథ్యం కూడా ఇందులో రిప్లెక్ట్ అవుతుందంటున్నారు. దీన్నే వీసీయూ గా ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి.