ఆ మూవీనే లాస్ట్.. వెట్రిమారన్ గుడ్ బై..
అయితే వెట్రిమారన్ గుడ్ బై చెప్పింది దర్శకత్వానికి కాదు.. నిర్మాణానికి మాత్రమే కావడం గమనార్హం. గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై ఇక సినిమాలను నిర్మించనని ప్రకటించారు.;
కోలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వెట్రిమారన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వివిధ సినిమాలకు దర్శకత్వం వహించిన, నిర్మించిన ఆయన.. మంచి హిట్స్ అందుకున్నారు. పలు చిత్రాలకు గాను నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు సడెన్ గా గుడ్ బై చెప్పారు. తన లాస్ట్ మూవీ కూడా ప్రకటించారు.
అయితే వెట్రిమారన్ గుడ్ బై చెప్పింది దర్శకత్వానికి కాదు.. నిర్మాణానికి మాత్రమే కావడం గమనార్హం. గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై ఇక సినిమాలను నిర్మించనని ప్రకటించారు. బ్యాడ్ గర్ల్ మూవీనే నిర్మాతగా తన చివరి సినిమా అని వెల్లడించారు. మానుషితోపాటు బ్యాడ్ గర్ల్ సినిమాల విషయంలో తలెత్తిన సమస్యల తర్వాత వెట్రిమారన్ ఆ ప్రకటన చేయడం గమనార్హం.
ఆ రెండు చిత్రాలు సెన్సార్ బోర్డుతో సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ, రాజకీయ ఆలోచనలను చిత్రీకరించినందున మానుషి మూవీకి మొదట సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. రివైజింగ్ కమిటీ దానిని తిరస్కరించిన తర్వాత కూడా వెట్రిమారన్ ఆ విషయాన్ని చెన్నై హైకోర్టుకు తీసుకెళ్లారు.
అప్పుడు హైకోర్టు.. సినిమా విడుదల కావాలంటే కొన్ని కోతలు విధించాలని ఆదేశించింది. అదే సమయంలో బ్యాడ్ గర్ల్ మూవీ టీజర్ తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఎందుకంటే కొంతమంది ప్రేక్షకులు కొన్ని వర్గాలను ప్రతికూలంగా చూపించారని భావించారు. దీంతో చట్టపరమైన పరిశీలనకు వెళ్లాల్సి వస్తుంది.
ఇప్పుడు బ్యాడ్ గర్ల్ మూవీకి సంబంధించిన కార్యక్రమంలో వెట్రిమారన్ తన గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీని మూసివేస్తానని అనౌన్స్ చేశారు. సినిమాలు నిర్మించడం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. చట్టపరమైన తనిఖీలు, సెన్సార్‌షిప్ నిరంతరం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దర్శకుడిగా ఉండటం చాలా కష్టమని, నిర్మాతగా ఉండటం ఇంకా కష్టమని అన్నారు.
అయితే నిర్మాతగా టీజర్, ట్రైలర్ తో సహా సినిమా గురించి వచ్చే ప్రతి వ్యాఖ్య పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఆ అంశాలు సినిమా ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అది నిర్మాతకు అదనపు ఒత్తిడిగా మారుతుందని పేర్కొన్నారు. మానుషి కోర్టులో ఉందని, బ్యాడ్ గర్ల్ కోసం రివైజింగ్ కమిటీ వరకు వెళ్ళవలసి వచ్చిందని చెప్పారు. అందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.