త్రిబాణధారి బార్బారిక్.. ఈ వయసులో కూడా సత్యరాజ్ జోరు తగ్గలేదు..!
సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న సత్యరాజ్ మరోసారి తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు.;
సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న సత్యరాజ్ మరోసారి తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. గతంలో ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు మరో స్పెషల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి కేవలం నటించడం వరకే కాకుండా, సినిమాను ప్రొమోట్ చేయడంలోనూ యాక్టివ్‌గా పాల్గొనడం విశేషం.
‘త్రిబాణధారి బార్బారిక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయపాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌తో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.
ఇందులో ‘అనగా అనగా కథలా’ అనే సాంగ్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. తాతా మనవరాల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను చక్కగా చూపించే ఈ పాటకు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను ప్రమోట్ చేయడంలో సత్యరాజ్ కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ యువ నటులకు పోటీగా కనిపించారు.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఆయన పోటీ పడుతూ డ్యాన్స్ కూడా చేశారు. ఈ వయసులోనూ ట్రెండింగ్ ఫార్ములాలను ఫాలో అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటివరకు సినిమాపై విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీనియర్ నటుడు అయినా కూడా యూత్ ఎనర్జీతో ప్రమోషన్లలో పాల్గొంటూ కనిపించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో టీమ్ బిజీగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. మ్యూజిక్, ఎమోషన్స్, ఫ్యామిలీ కనెక్షన్‌తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా.. ఈ వయసులోనూ ప్రమోషన్లలో ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్న సత్యరాజ్ నిజంగా గ్రేట్. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.