• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బలగం వేణు.. ఆ ఇద్దరిలో...

బలగం వేణు.. ఆ ఇద్దరిలో ఎవరు?

| ఇటీవలి కాలంలో దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తూ.. స్వచ్చమైన కథలతో సినిమాలు చేయడం మొదలెట్టారు.

By - Tupaki Desk
Update: 2024-11-05 22:30 GMT

ఇటీవలి కాలంలో దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తూ.. స్వచ్చమైన కథలతో సినిమాలు చేయడం మొదలెట్టారు. అలా వచ్చిన దర్శకుల్లో వేణు ఎల్దండి ఒకడు. కమెడియన్ నుంచి డైరెక్టర్‌గా మారి అతడు తెరకెక్కించిన సినిమానే ‘బలగం’. తెలంగాణ ప్రాంతంలోని సంప్రదాయాలకు అద్దం పట్టే సహజ సిద్ధమైన కథతో రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రశంసలు కూడా అందుకుంది.

మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా వేణు ఎల్దండి ఇప్పటి వరకూ రెండో చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. వాస్తవానికి అతడు నేచురల్ స్టార్ నానితో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నట్లు, దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ వెంటనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి.

నేచురల్ స్టార్ నానితో వేణు ఎల్దండి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ వేయి కళ్లతో వేచి చూశారు. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. అయితే, దిల్ రాజు మాత్రం ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వేణు ఎల్దండి.. తన ప్రాజెక్టును ఆపేశాడని ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నితిన్‌తో ఈ సినిమాను చేస్తున్నట్లు టాక్ వచ్చింది.

‘బలగం’ వంటి బంపర్ హిట్ కొట్టినా వేణు ఎల్దండి రెండో సినిమా స్టార్ట్ కాకపోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అతడు హీరోను మళ్లీ మార్చేశాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో హనుమాన్‌తో సెన్సేషనల్ హిట్ కొట్టిన తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని అంటున్నారు.

తేజ సజ్జాతో వేణు ఎల్దండి తెరకెక్కించే సినిమా ‘ఎల్లమ్మ’ స్టోరీతోనే అని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంటే నేచురల్ స్టార్ నాని ఒప్పుకున్న కథనే ఇప్పుడు ఈ యంగ్ హీరో చేయబోతున్నాడని సమాచారం. ఒకవైపు నితిన్, మరోవైపు నాని తమ తమ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాళ్ల కమిట్‌మెంట్లు అయ్యే సరికి చాలా సమయం పట్టేలా ఉండడం వల్ల వేణు కొత్త హీరోను చూసుకున్నాడని చెప్తున్నారు.

మరోవైపు, తేజ సజ్జా ఇప్పుడు ‘మిరాయ్’ అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత తేజ సజ్జా ‘ఎల్లమ్మ’నే చేస్తాడని టాక్. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతోన్నాయి.

Tags:    
  • Venuyeldandi 
  • Balagamdirector 
  • Nani 
  • Nithiin 
  • Tejasajja 
  • Dilraju 
  • Tollywood 
  • Yellammamovie 
  • Venuyeldandimovie 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS