సిద్దు, మీను ఆదర్శం కాబోతున్నారా..?

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఒక వెబ్‌ సిరీస్‌ రూపొందబోతుంది. ఇప్పటికే స్టోరీ లైన్ రెడీ అయ్యింది. స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైంది.;

Update: 2026-04-21 17:30 GMT

ఒకప్పుడు సినిమాలతో పోల్చితే టీవీ షోలు, సీరియల్స్‌ను చాలా చిన్న చూపు చూసే వారు. కాలక్రమేనా సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా టీవీ షో లు, సీరియల్స్‌ నడిచాయి. సినిమాలతో ఏ స్థాయిలో నటీనటులకు గుర్తింపు దక్కిందో, దాదాపు అదే స్థాయిలో టీవీ షోలతో, సీరియల్స్‌ తో నటీనటులకు గుర్తింపు దక్కిన విషయం తెల్సిందే. ఇప్పుడు మళ్లీ టీవీల ప్రాభవం తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు సినిమాలతో ఓటీటీ కంటెంట్‌ పోటీ పడుతోంది. థియేట్రికల్‌ రిలీజ్ అవుతున్న సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఓటీటీ వెబ్‌ సిరీస్‌లు మంచి సక్సెస్‌ను దక్కించుకుని, అత్యధిక ప్రేక్షాభిమానంను సొంతం చేసుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మెల్ల మెల్లగా సినిమా స్టార్స్ ఓటీటీ కంటెంట్‌ లో నటించడం, వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం వంటివి చేస్తున్నారు.

హాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌ల జోరు....

ఇప్పటికే హాలీవుడ్‌ స్టార్స్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను సమానంగా చూస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఆ వ్యత్యాసం క్లీయర్‌గా కనిపిస్తోంది. ఆ వ్యత్యాసం మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోంది. బాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌ ఇప్పటికే ఓటీటీ కంటెంట్‌లో నటించేందుకు రెడీ అయ్యారు. కొందరు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌ల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. తెలుగు స్టార్‌ హీరో వెంకటేష్ సైతం వెబ్‌ సిరీస్‌లో కనిపించాడు. రానాతో కలిసి వెంకటేష్ రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ లో నటించాడు. అయితే ఆ వెబ్‌ సిరీస్ పూర్తి స్థాయి తెలుగు సిరీస్ కాకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా ఆధరించలేదు. అయితే ఇతర భాషల్లో రానా నాయుడు సిరీస్‌కి మంచి స్పందన దక్కింది. ఇప్పుడు ప్యూర్ తెలుగు వెబ్‌ సిరీస్ ఒకటి రాబోతుంది. తెలుగులో చాలా వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి. కానీ నోటెడ్‌ హీరో నటించబోతున్న వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వెబ్‌ సిరీస్‌...

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఒక వెబ్‌ సిరీస్‌ రూపొందబోతుంది. ఇప్పటికే స్టోరీ లైన్ రెడీ అయ్యింది. స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైంది. మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ సైతం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటి వరకు స్టార్‌ హీరోలతో సినిమాలను నిర్మించి పాపులర్‌ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ నిర్మాణంలో అడుగు పెట్టడంతో చాలా మంది ఇతర పెద్ద నిర్మాతలకు నాగవంశీ ఆదర్శం కాబోతున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. వెబ్‌ సిరీస్ అనగానే చిన్న చూపు ఉన్న వారు ఈ వెబ్‌ సిరీస్ వచ్చిన తర్వాత కచ్చితంగా తమ అభిప్రాయంను మార్చుకుంటారని, హిందీలో మాదిరిగా వెబ్‌ సిరీస్‌లకు ముందు ముందు టైం రాబోతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వెబ్‌ సిరీస్‌లో మీనాక్షి చౌదరి...

ఈ భారీ వెబ్‌ సిరీస్‌లో సిద్దుకు జోడీగా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి నటించబోతుంది. హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి ఇలా వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పడం వల్ల చాలా పెద్ద సాహసం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆఫర్లు తక్కువ ఉన్న వారు, పెద్దగా క్రేజ్ లేని వారు, కెరీర్‌ చివర్లో ఉన్న వారు మాత్రమే వెబ్‌ కంటెంట్‌ లో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరిలు వెబ్‌ సిరీస్‌లు నటిస్తున్న కారణంగా ఇండస్ట్రీలో ఇతర యంగ్‌ స్టార్స్‌కి వీళ్లు ఆదర్శం కాబోతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ హిట్‌ అయితే కచ్చితంగా ముందు ముందు యంగ్‌ హీరోలు వెబ్‌ సిరీస్‌ల వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హీరోయిన్స్ సైతం పారితోషికం, ఇతర విషయాలు పక్కన పెట్టి నటిగా నిరూపించుకునేందుకు వెబ్‌ సిరీస్‌లకు కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News