వెంకీ అట్లూరి.. దూకుడు మామూలుగా లేదుగా!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో వెంకీ అట్లూరి పేరు కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.;

Update: 2025-04-16 04:22 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో వెంకీ అట్లూరి పేరు కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తొలిప్రేమతో దర్శకుడిగా మారిన ఆయన.. డెబ్యూతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నారు.

అయితే మిస్టర్ మజ్ను, రంగ్ దే వంటి సినిమాలు తీసినా.. సరైన హిట్ అందుకోలేకపోయారు. ఆ సమయంలో వెంకీపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇంతలో సార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కేశారు. బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్ తో తెలుగు స్ట్రయిట్ మూవీ చేసి రెండు భాషల్లో మంచి విజయాన్ని దక్కించుకున్నారు.

నిజానికి.. అది మామూలు విజయం కాదనే చెప్పాలి. రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో వేరే లెవెల్ లో అలరించారు వెంకీ అట్లూరి. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అటు థియేటర్స్ లో.. ఇటు ఓటీటీలో లక్కీ భాస్కర్ మోత మోగించింది.

దీంతో వెంకీ అప్ కమింగ్ ప్రాజెక్టులపై అందరి ఫోకస్ పడింది. ప్రస్తుతం ఆయన సూర్య 46 మూవీ వర్క్స్ తో బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో వెంకీ ఓ మూవీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకా స్టోరీ లైన్ నెరేట్ చేయకపోయినా.. ఆఫర్ మాత్రం అందుకున్నారని సమాచారం. త్వరలోనే అజిత్ కు వెంకీ కథ చెప్పనున్నారని వినికిడి. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు తీసే ఛాన్సులు సొంతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

మరోవైపు, చిరంజీవితో వెంకీ ఓ మూవీ తీస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. సరైన స్టోరీ సెట్ అయితే.. ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆ మధ్య ఓ నిర్మాత కూడా చెప్పారు. ఇప్పుడు ఆ కాంబోకు కూడా టైమ్ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి స్టార్ హీరోల నుంచి అవకాశాలు అందుకుంటున్న వెంకీకి వరుస హిట్లు పడితే ఇక ఆయనకు తిరుగలేనట్లే. మరి ఎలాంటి విజయాలు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News