విజయ్ విలన్.. క్రేజ్ వచ్చినా ఇడ్లీ కొట్టును మరువలేదు
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ మూవీతో యువ హీరో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ హీరోగా మరోసారి ప్రేక్షకులను మెప్పించబోతున్నారు.;
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ మూవీతో యువ హీరో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ హీరోగా మరోసారి ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రను మలయాళ యంగ్ యాక్టర్ వెంకిటేష్ పోషిస్తున్నాడు. అతడి అటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఇప్పటికే ట్రైలర్‌లతో ఆకట్టుకుంటోంది. ఇక అతను ఇటీవల ఈవెంట్ లో మాట్లాడిన విధానం జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
విలన్‌తోనే వైరల్ ప్రీ-రిలీజ్ స్పీచ్
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకిటేష్ ప్రసంగం హైలైట్‌గా మారింది. దాదాపు పది నిమిషాల పాటు అతడు ఎంతో ఉత్సాహంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతో కాన్ఫిడెంట్‌గా తెలుగు మాటల్లో తన ఆనందాన్ని పంచుకున్న తీరు అక్కడున్న వారిని, అలాగే ఆ వీడియో చూసిన నెటిజన్లను కూడా ఆకట్టుకుంది. హీరో విజయ్ దేవరకొండ సైతం వెంకిటేష్‌ని ప్రత్యేకంగా పొగడుతూ సోషల్ మీడియా పోస్టు చేశారు. ఈ స్పీచ్ కారణంగా వెంకిటేష్‌పై తెలుగు ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది.
రోడ్‌సైడ్ ఇడ్లీ కొట్టు
వెంకిటేష్ సినిమాల్లోకి రాకముందు త్రివేండ్రమ్‌లో ఒక చిన్న రోడ్‌సైడ్ ఇడ్లీ షాప్ నడిపేవాడు. పెద్ద హోటల్ కాదు.. నడవడమే కష్టమయ్యే చిన్న స్టాల్. కానీ, అతని హ్యాండ్‌మేడ్ ఇడ్లీలు అక్కడ హాట్ ఫేవరెట్. రోజూ పదుల సంఖ్యలో కస్టమర్స్ వచ్చి చక్కగా ఎంజాయ్ చేసేవారు. అక్కడ ఒక ఇడ్లీ పొందాలంటే పది నిమిషాలు ఎదురు చూడాల్సిందే. రీల్ వీడియోల వల్ల ఆ షాప్ సోషల్ మీడియాలో మరింత ఫేమస్ అయింది.
విలన్‌గా తనకు అవకాశాలు వస్తున్నా, కొంతమంది గుర్తించటం మొదలుపెట్టినా వెంకిటేష్ తను మొదలుపెట్టిన ఇడ్లీ షాప్‌ను మాత్రం మూసేయలేదు. నటుడిగా బిజీగా ఉన్నా, అవకాశాల కోసం బిజీగా తిరిగినా అప్పుడప్పుడు స్వయంగా షాప్‌కి వెళ్లి, తన కస్టమర్లకు ఇడ్లీలు సర్వ్ చేస్తాడు. అతడి డౌన్ టూ ఎర్త్ నేచర్, రూట్స్‌కి అట్టాడం చూసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.
కింగ్‌డమ్ మూవీ వల్ల కొత్త జెర్నీ
ఇప్పటికే మలయాళంలో కొన్ని మంచి సినిమాలు చేసిన వెంకిటేష్‌కి ‘కింగ్‌డమ్’తో టాలీవుడ్‌లో ఫుల్ గుర్తింపు రావాలనే ఆశ ఉంది. ఈ సినిమాలో అతడి మురుగన్ విలన్ పాత్ర ట్రైలర్‌లోనే బాగా హైలైట్ అయింది. చిత్రంలో అతడి పాత్ర క్లిక్ అయితే, మరిన్ని తెలుగు సినిమాల్లో అవకాశాలు రావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వెంకిటేష్ జీవితం ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. సాధారణ కుటుంబం, చిన్న వ్యాపారం నుంచి, కష్టపడి, ప్రయత్నించి, ఇప్పుడు తెలుగు పెద్ద సినిమాలో కీలక విలన్‌గా మెరిసే అవకాశం అందుకున్నాడు. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ సినిమాతో పాటు అతడి ఇడ్లీ షాప్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇక సినిమా రిలీజ్ అనంతరం అతనికి ఏ స్థాయిలో గుర్తింపు అందుతుందో చూడాలి.