• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిల్ వెంకీ.. అప్పుడే...

అనిల్ వెంకీ.. అప్పుడే స్పీడ్ పెంచేశారు

| విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది.

By - Tupaki Desk
Update: 2024-08-14 07:56 GMT

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. సంక్రాంతి రేసులో నిలవబోయే ఈ చిత్రం, ఈ కాంబినేషన్ లో మూడో హిట్ కొట్టేందుకు ముస్తాబవుతోంది. ప్రొడక్షన్ నంబర్ 58గా నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పొల్లాచిలో షూటింగ్ పూర్తి వేగంగా కొనసాగుతోంది. ఇక ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో మేకర్స్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో విక్టరీ వెంకటేష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో వెంకటేష్ ఎక్స్-కాప్ పాత్రలో కనిపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. షూటింగ్ సెట్‌లో అనిల్ రావిపూడి, వెంకటేష్ సరదాగా గడుపుతున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఈ నెల మొత్తం షూటింగ్ షెడ్యూల్ లో, టీమ్ టాకీ పార్ట్‌తో పాటు పాటలను కూడా చిత్రీకరించనుంది.

ఈ చిత్రం ఒక ట్రైయాంగ్యులర్ క్రైమ్ డ్రామా గా రూపుదిద్దుకుంటోంది. ఈ కథలో ముగ్గురు కీలక పాత్రల మధ్య ఉన్న కనెక్షన్ ను రసవత్తరంగా చూపించనున్నారు. ఇందులో హీరో, అతని మాజీ ప్రేయసి, మరియు అతని భార్య మధ్య సాగే కథను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ టమ్మిరాజు, స్క్రీన్‌ప్లే ఎస్ కృష్ణ మరియు జి అధినారాయణ కలిసి చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లను వీ వెంకట్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారాగణం కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటి గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మీ సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, మరియు చిట్టి నటిస్తున్నారు.

ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, సంక్రాంతి పండగకు ఈ సినిమా ఒక బిగ్ హిట్ అవుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో ఇప్పటికే F2, F3 సినిమాలు వచ్చాయి. కమర్షియల్ గా ఆ సినిమాలు మంచి లాభాలు అందించాయి. ఇక ఇప్పుడు రాబోయే 3వ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

The ex-cop kicks off his DUTY with full ENERGY🤘

Victory @VenkyMama Joins the sets of #VenkyAnil3 x #SVC58 ❤️‍🔥

The shoot of this triangular crime entertainer is happening at a rapid pace in Pollachi 💥💥

— https://t.co/rwCpc90hl8

SANKRANTHI 2025 RELEASE 🥳@AnilRavipudi… pic.twitter.com/fBeJhpqnqQ

— Sri Venkateswara Creations (@SVC_official) August 14, 2024
Tags:    
  • Venkatesh 
  • Anilravipudi 
  • Movie 
  • Shooting 
  • Tollywood 
  • Filmindustry 
  • Dilraju 
  • Srivenkateswaracreations 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS