వెంకీ రేంజు 300కోట్లు.. త్రివిక్రమ్ టెన్షన్!
టాలీవుడ్ స్టార్ హీరోల ఎస్కలేషన్ అనూహ్యమైనది. బాహుబలితో కేవలం ప్రభాస్ రేంజ్ మాత్రమే కాదు, మొత్తం టాలీవుడ్ రేంజ్ పెరిగింది.;
టాలీవుడ్ స్టార్ హీరోల ఎస్కలేషన్ అనూహ్యమైనది. బాహుబలితో కేవలం ప్రభాస్ రేంజ్ మాత్రమే కాదు, మొత్తం టాలీవుడ్ రేంజ్ పెరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ అమాంతం ఎగసింది. ఇప్పుడున్న సీనియర్ హీరోలు సైతం తమ స్టామినాని మించి పోరాడే సత్తువను సంపాదించారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే, పట్టుమని 100కోట్లు అయినా కష్టమే అనుకునే చెడు నోళ్లకు తాళం వేస్తూ, ఒకే ఒక్క సినిమాతో 250కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.
విక్టరీ వెంకటేష్ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` 250 కోట్లు వసూళ్లతో రియల్ విక్టరీ ఎలా ఉంటుందో చూపించింది. సీనియర్లలో ఓవర్ నైట్ సంచలనాలకు కేరాఫ్ గా మారాడు వెంకీ. వయసుతో సంబంధం లేకుండా విక్టరీ కూడా పాన్ ఇండియన్ హీరోనే ఇప్పుడు. అయితే వెంకటేష్ నటించే తదుపరి చిత్రం ఎలా ఉండాలి? అంటే.. ఇదిగో ఈ రేంజుకు తగ్గితే కుదరదని ఫ్యాన్స్ దర్శకులను హెచ్చరిస్తున్నారు. 250 కోట్ల నుంచి 300 కోట్ల క్లబ్ లోకి వెంకీ రావాలి. అతడు రజనీకాంత్ లా 500 కోట్లు కొల్లగొట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇలాంటి సమయంలో తక్కువ టైమ్ లో త్రివిక్రమ్ ఏదో ఒక సినిమా తీసేస్తాను అంటే కుదరదని కూడా వెంకీ మామ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. త్రివిక్రమ్ ఏది ప్లాన్ చేసినా అనీల్ రావిపూడిని మించిన విజయాన్ని వెంకీకి కట్టబెట్టాలి. దానికోసం ఏం చేస్తాడో అది అతడి ఇష్టం! అని ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో పంచ్ లు విసురుతుంటే త్రివిక్రమ్ కి ఏం పాలుపోవడం లేదట! `పుష్ప` స్టార్ అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా ఆలస్యమవుతుంటే, వెంకీతో తక్కువ సమయంలో ఒక సినిమాని త్రివిక్రమ్ పూర్తి చేస్తాడని కథనాలొస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ అంచనాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. మరి దీనిని మాయావి త్రివిక్రమ్ సీరియస్ గా తీసుకుంటున్నారా లేదా ? చూడాలి. వెంకీతో త్రివిక్రమ్ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది.