వెంకీ త్రివిక్ర‌మ్ మూవీ మొద‌ల‌య్యేద‌ప్పుడే!

ఇప్పుడు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గానే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి;

Update: 2025-08-18 11:27 GMT

తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కాంబినేష‌న్ల‌లో విక్ట‌రీ వెంక‌టేష్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేషన్ కూడా ఒక‌టి. వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలో నువ్వ నాకు నచ్చావ్, మ‌ల్లీశ్వ‌రి సినిమాల‌కు వ‌ర్క్ చేసిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌యంలో త్రివిక్రమ్ కేవ‌లం ర‌చ‌యిత మాత్ర‌మే. త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ అయ్యాక వెంక‌టేష్ తో క‌లిసి వ‌ర్క్ చేసింది లేదు.

ఇప్పుడు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. రీసెంట్ గానే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హారికా హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తు్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇద్ద‌రు హీరోయిన్లతో..

త్రివిక్ర‌మ్- వెంకీ క‌ల‌యికలో రానున్న సినిమా సెప్టెంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ మొద‌లుపెట్టుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి హీరోయిన్ల కోసం త్రిష‌, రుక్మిణి వ‌సంత్, నిధి అగ‌ర్వాల్ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

మెగా157లో జాయిన్ అయ్యేది అప్పుడే!

కామెడీ, సెంటిమెంట్ మ‌రియు ఎమోష‌న్స్ ను క‌ల‌గలిపి త్రివిక్ర‌మ్ ఈ క‌థ‌ను సిద్ధం చేశార‌ని, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను ఈ సినిమా త‌ప్పక మెప్పిస్తుంద‌ని అంటున్నారు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ నాటికి సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇక వెంక‌టేష్ విష‌యానికొస్తే వెంకీ ఈ సినిమాతో పాటూ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న మెగా157లో కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మెగా157లో వెంకీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని, దానికి సంబంధించిన షూటింగ్ లో వెంకీ అక్టోబ‌ర్ లో జాయిన్ అవుతార‌ని స‌మాచారం.

Tags:    

Similar News