వెంకటేశ్ - త్రివిక్రమ్.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..?
సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాతో మొదటిసారి 300 కోట్ల మార్క్ ను టచ్ చేసిన విక్టరీ వెంకటేష్ మంచి జోష్ లో ఉన్నాడు.;
సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాతో మొదటిసారి 300 కోట్ల మార్క్ ను టచ్ చేసిన విక్టరీ వెంకటేష్ మంచి జోష్ లో ఉన్నాడు. ఇక తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్థాయిలో ఓ సీనియర్ హీరోగా నిలిచిన వెంకీ.. తన తర్వాతి ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా? ఎలాంటి కథను ఎంచుకుంటారా? అన్నదానిపై ఇప్పటికే పలుచోట్ల చర్చలు ప్రారంభమయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుందట. జూన్ 6న అధికారికంగా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసే అవకాశం ఉందన్న బజ్ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పని దాదాపు పూర్తవ్వగా.. త్రివిక్రమ్ శైలిలో ఉండే వినోదాత్మకంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథగా రూపొందుతున్నదట. అయితే దర్శకుడు, హీరో పర్సనల్ సర్కిల్‌లో మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ కాంబినేషన్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హీరోయిన్‌గా రుక్మిణి వసంతను తీసుకోనున్నారన్న ప్రచారం. 'సప్త సాగరాలు' వంటి సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ, వెంకటేశ్ సరసన తొలిసారి జతకట్టనున్నారన్న మాట టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.
ఇక త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో ఓ పౌరాణిక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ఆలస్యంగా ప్రారంభం కావొచ్చని, అట్లీ సినిమా పూర్తయ్యేంతవరకూ గ్యాప్ ఉండే అవకాశం ఉన్నందున, త్రివిక్రమ్ వెంకటేశ్ సినిమాను ముందుగా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు బజ్. కథ రెడీగా ఉండడంతో పాటు, వెంకటేశ్ డేట్లు కూడా ఖరారవుతుండడంతో ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే త్రివిక్రమ్ – వెంకటేశ్ కాంబోలో ఓ సినిమా వస్తుందన్న మాటతోనే ఫ్యాన్స్‌కి భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఓ మినిమం గ్యారంటీ హిట్ అని భావించే సినీ లవర్స్ ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 6న అఫీషియల్ అప్‌డేట్ వస్తుందా లేదా అన్నది చూడాలి కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఓ సాలిడ్ కంటెంట్‌తో సినిమా రానుందన్న విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది.