అవమానించి వేధించారని గాయని ఆరోపణలు
గాయని లగ్నజిత్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. `దేవి చౌధురాణి` చిత్రం నుండి ప్రాచుర్యం పొందిన `జోయ్ మా` అంటూ సాగే పాటను పాడారు.;
ప్రముఖ బెంగాలీ గాయని లగ్నజత్ చక్రవర్తిని భక్తి గీతం ఆలపించినందుకు వేధింపులకు గురయ్యానని ఆరోపించడం సంచలనంగా మారింది. భక్తి గీతానికి బదులుగా ఏదైనా సెక్యులర్ పాటను పాడాలని అతడు బలవంతం చేసినట్టు గాయని ఆరోపించారు. తూర్పు మిడ్నాపూర్‌లోని భగవాన్‌పూర్‌లో ఒక ప్రైవేట్ పాఠశాలలో శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో నేపథ్య గాయని లగ్నజిత చక్రవర్తి భక్తి గీతం ఆలపించగా, తనను వేధించి, అవమానించినట్లు ఆరోపించడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది. ఈ ఘటన పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. పోలీసులు పాఠశాల యజమానిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసేందుకు సహకరించని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
గాయని లగ్నజిత్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. `దేవి చౌధురాణి` చిత్రం నుండి ప్రాచుర్యం పొందిన `జోయ్ మా` అంటూ సాగే పాటను పాడారు. ఈ భక్తి పాటను పాడుతున్నప్పుడు మధ్యలో మెహబూబ్ మల్లిక్ అనే ఉపాధ్యాయుడు ఈ పాట పాడొద్దంటూ అడ్డుకున్నాడు. మల్లిక్ ఆ సమయలో తనపై అసభ్యకరమైన భాషను ఉపయోగించాడని, పాటను ఆపమని ఆర్డర్ చేసాడని లగ్నజిత తన లిఖితపూర్వక ప్రకటనలో ఆరోపించింది.
మల్లిక్ దుర్బాషలాడుతూ.. ``ఇక చాలు... ఇప్పుడు ఏదైనా లౌకిక గీతం పాడు`` అన్నాడు. అది కేవలం మాటలతోనే ఆగలేదు. ఆ గందరగోళంలో నన్ను శారీరకంగా కూడా వేధించారు! అని గాయని తన ఫిర్యాదులో పేర్కొంది. అవమాన కరమైన వ్యాఖ్యలతో పాటు శారీరకంగా వేధింపులకు పాల్పడిన తర్వాత నేను ఆ వేదిక నుంచి దిగి వెళ్లిపోయానని లగ్నజీత్ తెలిపారు.
ఆ తర్వాత గాయని నేరుగా భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం పోలీస్ యాంత్రాంగం దీనిని సీరియస్ గా పరిగణించింది. ప్రస్తుతం స్కూల్ యజమాని, తనపై దుర్భాషలాడిన టీచర్‌పైనా పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను విచారించి బాధితురాలికి న్యాయం జరిగేట్టు సహకరిస్తామని, భద్రతను ఏర్పాటు చేస్తామని కూడా పోలీసులు హామీ ఇచ్చారు.