సంక్రాంతి రేస్..వాటికి థియేటర్లు కష్టమేనా?
సంక్రాంతి ఫెస్టివల్‌కు తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. థియేటర్లు కూడా వాటికే కేటాయించి మిగిలితే డబ్బింగ్ సినిమాలకు కేటాయించడం ఎప్పటి నుంచో జరుగుతోంది.;
సంక్రాంతి రేసులో తెలుగు సినిమాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన ఐదు సినిమాలు ఈ సారి సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `ది రాజాసాబ్`తో పాటు మెగాస్టార్ చిరంజీవి `మన శంకరవరప్రసాద్` కూడా పోటీపడుతున్నాయి. ట్రేడ్ వర్గాల కథనం ప్రకారం పోటీ ప్రధానంగా ఈ రెండు సినిమాల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మాస్ మహారాజా రవితే, యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి కూడా రంగంలోకి దిగుతున్నారు.
రవితేజ తొలి సారి తన మార్కు సినిమాలకు పూర్తి భిన్నంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టోరీతో చేస్తున్న మూవీ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కిషోర్ తిరుమల కొంత విరామం తరువాత చేస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఇక శర్వానంద్ నటిస్తున్న ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా `నారీ నారీ నడుమ మురారి` జనవరి 14న వస్తోంది.
యంగ్ హీనో నవీన్ పొలిశెట్టి కొంత గ్యాప్ తరువాత చేస్తున్న `అనగనగ ఒకరాజు` కూడా ఇదే డేట్‌ని రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అంతా ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. అయితే సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాల్లో చిరు మూవీనే ఈ విషయంలో ముందంజలో ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వీటితో పాటు రెండు తమిళ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
దళపతి విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న `జన నాయకుడు`, శివకార్తికేయన్, సుధా కొంగరల `పరాశక్తి` రిలీజ్ అవుతున్నాయి. దీంతోబ రెండేళ్ల క్రితం ఎదురైన పరిస్థితులే మళ్లీ రిపీట్ కాబోతున్నాయని తెలుస్తోంది. తెలుగు సినిమాలతో పాటు పోటీపడిన తమిళ చిత్రాలకు పెద్దగా అప్పట్లో థియేటర్లు లభించలేదు. దీంతో ఒకటి రెండు రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది కూడా ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సంక్రాంతి ఫెస్టివల్‌కు తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. థియేటర్లు కూడా వాటికే కేటాయించి మిగిలితే డబ్బింగ్ సినిమాలకు కేటాయించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ సారి కూడా డిస్ట్యిబ్యూటర్లు అదే ఫాలో కాబోతున్నారు. ముందుగా విడుదలవుతున్న ప్రభాస్ `ది రాజా సాబ్`కు భారీ స్థాయిలో థియేటర్లు కేటాయించబోతున్నారు. ఆ తరువాత చిరు `మన శంకర వరప్రసాద్` ఆక్రమించబోతోంది. ఇక మిగిలిన థియేటర్లని రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వా `నారీ నారీ నడుమమురారి`, నవీన్ పొలిశెట్టి `అనగనగ ఒక రాజు` పంచుకోనున్నాయి. హైదరాబాద్‌లో మెయిన్ థియేటర్లు `జన నాయకుడు`, శివకార్తికేయన్ `పరాశక్తి`కి మేనేజ్ చేసినా బిజీ సెంటర్లలో మాత్రం వీటికి థియేటర్లు దక్కడం ఇంపాజిబుల్. దీంతో డబ్బింగ్ సినిమాల కారణంగా సంక్రాంతికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదనే టాక్ వినిఇస్తోంది.