స‌మ‌యం ఆస‌న్న‌మైంది మిత్ర‌మా!

అటుపై ఈ ఏడాది మ‌ళ్లీ గ్యాప్ వ‌చ్చింది. అట్లీ సినిమాతో 2026లోనూ ప్రేక్షకుల ముందుకు రావ‌డం దాదాపు లాంఛ న‌మే.;

Update: 2025-12-21 11:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. బ్యాలెన్స్ షూటింగ్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి 2026 ఏడాదిలోనే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో బ‌న్నీ త‌దుప‌రి చిత్రంపై అప్పుడే చ‌ర్చ మొద‌లైంది. అత‌డు ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తాడు? ఎలాంటి క‌థ‌తో కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తాడు? ఇలా డిస్క‌ష‌న్ షురూ అయింది. తాజాగా అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది మిత్ర‌మా అంటూ అభిమానులు కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు షురూ చేస్తున్నారు.

కెరీర్ లో రెండు సార్లు బ్రేక్:

హీరోగా బ‌న్నీ కెరీర్ ప్రారంభ‌మైన నాటి నుంచి ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వ‌చ్చాడు. 2003 లో `గంగోత్రి`తో హీరోగా లాంచ్ అయ్యాడు. అప్ప‌టి నుంచి 2018 వ‌ర‌కూ ఎక్క‌డా మ‌ధ్య‌లో బ్రేక్ లేకుండా ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసాడు. అప్పుడ‌ప్పుడు రెండు సినిమాలతో కూడా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ఉన్నాడు. 2019 లో మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. మ‌ళ్లీ 2021-24 మ‌ధ్య మాత్రం రెండు సినిమాలే చేసాడు. అప్పుడే బ‌న్నీ పాన్ ఇండియా కెరీర్ మొద‌లు పెట్ట‌డంతో డిలే అయింది. ఈ మ‌ధ్య‌లోనే `పుష్ప` రెండు భాగాలు రిలీజ్ అయ్యాయి.

అభిమానుల అభ్య‌ర్ద‌న‌లు:

అటుపై ఈ ఏడాది మ‌ళ్లీ గ్యాప్ వ‌చ్చింది. అట్లీ సినిమాతో 2026లోనూ ప్రేక్షకుల ముందుకు రావ‌డం దాదాపు లాంఛ న‌మే. ఈ నేప‌థ్యంలో 2027లో రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్ విష‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చా జ‌రుగుతోంది. పాన్ ఇండియా స్టార్ అయినా? గ్యాప్ తీసుకోకుండా పాత విధానంలోనే సినిమాలు రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. పాన్ ఇండియా క‌థ‌ల విష‌యంలో బ‌న్నీ ప్ర‌ణాళిక ఎలా ఉన్నా? అభిమానుల కోసం మాత్రం గ్యాప్ ఇవ్వొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . మ‌రి ఈ అభ్య‌ర్ద‌న‌ల‌ను బ‌న్నీ ఎలా తీసుకుంటాడు? అన్న‌ది చూడాలి.

బ‌న్నీతో ఎవ‌రికా ఛాన్స్:

పాన్ ఇండియా స్టార్ అయిన నేప‌థ్యంలో బ‌న్నీ పాన్ ఇండియా క‌థ‌ల‌కే క‌ట్టుబ‌డ‌తాడా? రీజ‌న‌ల్ మార్కెట్ ఫ‌రిదిలో సినిమాలు చేస్తాడా? అన్న సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. వాస్త‌వానికి బోయ‌పాటి శ్రీను తో బ‌న్నీకి క‌మిట్ మెంట్ ఉంది. కానీ బోయ‌పాటి ఉన్న సిచ్వేష‌న్ లో అత‌డితో ముందుకెళ్ల‌డం క‌ష్ట‌మనే మాట వినిపిస్తోంది. ఇంత వ‌ర‌కూ బ‌న్నీకి క‌థ‌లు చెప్పి క్యూలో ఉన్న మ‌రో డైరెక్ట‌ర్ పేర్లు అయితే తెర‌పైకి రాలేదు. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ త‌దుప‌రి ద‌ర్శ‌కుడిపై ఫిలిం స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర చర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News