రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న పెద్ది టీమ్.. కారణం?
ఇక్కడే ఐదు రోజులపాటు క్లైమాక్స్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రామ్ చరణ్ అలాగే పెద్ది బృందం ఢిల్లీ షెడ్యూల్ ముగించడానికి ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు.;
రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకుని ఏకంగా గ్లోబల్ స్టార్ గా బిరుదును సొంతం చేసుకున్న ఈయన.. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేసి డిజాస్టర్ ను చవిచూశారు.ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనాకి అవకాశం ఇచ్చారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చే యేడాది మార్చ్ 27న రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇకపోతే విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా రాష్ట్రపతి భవనానికి చేరుకుంది పెద్ది టీం. సడన్గా రాష్ట్రపతి భవనానికి వెళ్లడం ఏంటి అని అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేయగా అసలు విషయంలోకి వెళ్తే.. గ్రామీణ నేపథ్యంలో సాగుతున్న పెద్ది సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు బుచ్చిబాబు సన. అందులో భాగంగానే రాష్ట్రపతి భవన్, అగ్రసేన్ కి బాగోలి వంటి ప్రదేశాలతో పాటు ఢిల్లీలోని కొన్ని కీలకమైన ప్రదేశాలను ఎంపిక చేసుకొని సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక్కడే ఐదు రోజులపాటు క్లైమాక్స్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రామ్ చరణ్ అలాగే పెద్ది బృందం ఢిల్లీ షెడ్యూల్ ముగించడానికి ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు. అటు నవంబర్లో ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు తర్వాత షూటింగ్ ను తిరిగి షెడ్యూల్ చేసిన చిత్ర బృందం.. అందులో భాగంగానే శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్ సమీపంలో సినిమా షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్ కనిపించారు. భారీ పొగ మంచు కారణంగా షూటింగ్ దాదాపు మూడు గంటలు ఆలస్యమైనా.. ఆ తర్వాత కొనసాగింది.
ఈరోజు సాయంత్రం అగ్రసేన్ కి బాగోలీలో షూటింగ్ చేయనున్నారు. నిజానికి రాష్ట్రపతి భవన్ లో షూటింగ్ అంటే చాలా సాహసంతో కూడుకున్న పని. పైగా అనుమతి కోసం అటు చిత్ర బృందం కూడా నెలల తరబడి వేచి ఉన్నారట. ఎట్టకేలకు వారి ఓపిక ఫలించి రాజీ పడకుండా ఐకానిక్ లొకేషన్ లో చిత్రీకరించడానికి అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని మిగిలిన ఒక స్పెషల్ సాంగ్ కూడా త్వరలో పూర్తి చేస్తే పెద్ది సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అటు విడుదలకి కూడా పెద్దగా సమయం లేకపోవడం వల్లే బుచ్చిబాబు త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.