వెంకీమామ కోసం గురూజీ బానే ప్లాన్ చేశాడే.. వర్కౌట్ అయితే రికార్డ్స్ బ్రేక్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు వెంకటేష్. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ వరుసగా హీరోగా సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.;

Update: 2025-10-09 05:15 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు వెంకటేష్. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ వరుసగా హీరోగా సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ముఖ్యంగా తాను నమ్ముకున్న ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే ప్రేక్షకులను అలరిస్తూ మరింత సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటున్నారు వెంకటేష్. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రముఖ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రాంతీయంగా 300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు గెస్ట్ రోల్ చేస్తూనే.. మరొకవైపు అభిమానుల కోసం హీరోగా మరో కొత్త సినిమా ప్రకటించారు వెంకటేష్. ప్రస్తుతం ఈయన గురూజీగా పేరు సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెప్పుకునే ఈ సినిమా షూటింగ్ తర్వాత షెడ్యూల్ తో ముగుస్తుంది.

సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం గురూజీ చాలా కొత్తగా వెంకీ మామ కోసం ప్లాన్ చేశారు. ఒకవేళ ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందే అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి గురూజీ చేసిన ప్లాన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

త్రివిక్రమ్ తాజాగా అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలకు పనిచేసిన యువ సంగీత సంచలనం హర్షవర్ధన్ రామేశ్వర్ ను మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకి తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది అని సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయని, ఈ ప్రాజెక్టు కోసం రెండు ట్యూన్లు లాక్ చేయబడినట్లు తెలుస్తోంది కుటుంబ భావోద్వేగాలతో కూడిన క్లీన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి "అబ్బాయిగారు 60 ప్లస్" అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే టీం ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ.. సరిగ్గా ఆ టైటిల్ సరిపోతుందని వారు భావిస్తున్నారట. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాను విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి తోడు చాలా రోజుల తర్వాత మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గురూజీ.. మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News