వెంకటేశ్ - త్రివిక్రమ్.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో హీరో వెంకటేశ్ కథల సెలెక్షన్ విషయంలో కొత్త తరహాలో ఆలోచిస్తున్నాడు.;

Update: 2025-07-17 11:30 GMT

టాలీవుడ్‌లో హీరో వెంకటేశ్ కథల సెలెక్షన్ విషయంలో కొత్త తరహాలో ఆలోచిస్తున్నాడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లలో తనదైన మార్క్ ఉన్న వెంకీ.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పటివరకు దర్శకుడిగా త్రివిక్రమ్ సినిమాల్లో నటించని వెంకటేశ్.. మొదటిసారి ఆయనకు ఓకే చెప్పడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో, ఫ్యాన్స్‌లో హైప్ ఏర్పడుతోంది. హ్యూమర్, ఎమోషన్ తరహాలో ఆ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ దర్శకుడిగా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ, ఆయన స్క్రిప్ట్ పైనా, డైలాగ్స్ పైనా నమ్మకముంది. ఇటీవల వెంకటేశ్ కోసం ఓ కామెడీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్‌ను తయారు చేశాడట. ఈ కథను వెంకీ వెంటనే ఓకే చేశారట. నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.

ప్రస్తుతం సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌కు ముంబైలో సెటప్ రూపొందిస్తున్నారని ఫిలింనగర్ వర్గాల టాక్. పూర్తి స్థాయి వినోదాత్మకతతో ఉండేలా కథను రూపొందించిన త్రివిక్రమ్.. వెంకటేశ్ పాత్రను కూడా చాలా వినూత్నంగా రూపొందించారట. ఇప్పటివరకు ఆయన చేయని కామెడీ షేడ్‌ను ఎలివేట్ చేసేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది. దీంతో ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో వెంకీ మళ్లీ ఫాంలోకి వచ్చారు. మంచి హిట్ అందుకున్న ఆయన.. అదే జోష్‌ను కొనసాగించేందుకు త్రివిక్రమ్ చిత్రాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ కూడా చాలా గ్యాప్ తర్వాత పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇది ఇద్దరి కెరీర్‌లలో ఒక డిఫరెంట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. హీరోయిన్‌గా టాప్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. మ్యూజిక్, డీవోపీ, ఎడిటింగ్ లాంటి టెక్నికల్ విభాగాల్లోనూ అగ్రకథానాయకులకు పనిచేసిన టాప్ టాలెంట్‌ను తీసుకుంటున్నారు. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలై.. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారట.

Tags:    

Similar News