వెంకీ మామ స్టార్ డైరెక్టర్‌ని రిజెక్ట్ చేశాడా?
25 ఏళ్ల క్రితం విడుదలై సూపర్‌హిట్ అనిపించుకున్న `నువ్వు నాకు నచ్చావ్` మూవీతో డైలాగ్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ 2002లో తరుణ్ హీరోగా నటించిన `నువ్వే నువ్వే` సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.;
గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి `సంక్రాంతికి` వస్తున్నాం`తో ఎలాంటి అంచనాలు లేకుండానే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుని రికార్డు స్థాయి సక్సెస్‌ని సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం మెగాస్టార్‌తో కలిసి ఈ సంక్రాంతికి `మన శంకరవప్రసాద్ గారు`తో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుఉ రాబోతోంది. ఇందులో వెంకటేష్ కీలక అతిథి పాత్రలో కనిపించి నవ్వులు పంచబోతున్నారు. ఇదిలా ఉంటే హీరోగా `ఆదర్శకుటుంబం హౌజ్ నం.47` చేస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. 25 ఏళ్ల క్రితం విడుదలై సూపర్‌హిట్ అనిపించుకున్న `నువ్వు నాకు నచ్చావ్` మూవీతో డైలాగ్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ 2002లో తరుణ్ హీరోగా నటించిన `నువ్వే నువ్వే` సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. ఈ మూవీ తరువాత వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అది కార్యరూపం దాల్చలేదు.
పెద్ద నిర్మాతలు చాలా మంది వెంకీ, త్రివిక్రమ్‌ల కాంబోలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం ప్రముఖ నిర్మాత స్రవంత రవికిషోర్.. వెంకీ, త్రివిక్రమ్‌ల కలయికలో సినిమా చేయాలని ప్లాన్ చేశారట. ఆ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. `త్రివిక్రమ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో అది వెంకటేష్‌కు కరెక్ట్‌గా సరిపోతుందని భావించి వెంటనే ఆ స్టోరీని వెంకటేష్‌కు వినిపించమన్నాను. ఆ టైమ్‌లో వెంకీ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌తో `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` మూవీ చేస్తున్నాడు.
త్రివిక్రమ్ వెళ్లి కథ చెప్పడంతో తాను చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే` తరహాలోనే ఉండటంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ని రిజెక్ట్ చేశాడు. దాంతో వీరి కాంబినేషన్ మళ్లీ కార్యరూపం దాల్చలేదు` అన్నారు. అలా 18 ఏళ్ల క్రితం కుదరని కాంబినేషన్ ఇప్పుడు సెట్టయింది. 18 ఏళ్ల క్రితం రిజెక్ట్ చేసిన త్రివిక్రమ్‌తో కలిసి ఇప్పుడు వెంకటేష్ సినిమా చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కమర్షియల్ అంశాలను జోడించి త్రివిక్రమ్ ఈ మూవీని రూపొందిస్తున్నాడట.
సరికొత్తగా కామెడీ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని జోడించి త్రివిక్రమ్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ తరువాత త్రివిక్రమ్ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఓ భారీ మైథలాజికల్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నారు. ముందు బన్నీతో అనుకుని.. ఆ తరువాత ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా బన్నీతోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. భారీ బడ్జెట్‌తో తెరపైకి రానున్న ఈ మూవీ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిసింది.