వెంకటేష్ టైమ్ గ్యాప్ దానికోసమేనా..?

ఐతే అనిల్ తో వెంకీ సింక్ బాగా కుదిరింది. అందుకే ఆయనతో సినిమాలు హ్యాట్రిక్ హిట్ సాధించాయి.;

Update: 2025-04-29 02:45 GMT
వెంకటేష్ టైమ్ గ్యాప్ దానికోసమేనా..?

3 దశాబ్దాల కెరీర్.. 75 సినిమాల అనుభవం ఉన్న విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతమైన అభిమానం. వెంకీ సినిమా అంటే చాలు కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా అని ఫిక్స్ అవుతారు. ఐతే పెరిగిన టికెట్ల రేట్ల వల్ల ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి చూడలేని పరిస్థితి కానీ అదే ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే చాలు ఫ్యామిలీ అంతా కలిసి చూసేవారు. ఇప్పటికి కూడా వెంకటేష్ సినిమాలు అలానే ఆదరణ పొందుతున్నాయి. ఎఫ్2, ఎఫ్ 3 హిట్ కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ అనిపించుకుంది.

ఐతే వెంకటేష్ ఒక సూపర్ హిట్ తర్వాత వెంటనే మరో సినిమా చేస్తాడని అనుకోగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నెక్స్ట్ సినిమాకు టైం తీసుకుంటున్నాడు. వెంకీ నెక్స్ట్ సినిమా రేసులో డైరెక్టర్స్ ఒకరిద్దరు ఉన్నారు. ఐతే వారెవరన్నది క్లారిటీ రావట్లేదు. లాస్ట్ ఇయర్ న్యూ ఏజ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో శైలేష్ కొలనుతో సైంధవ్ చేశాడు వెంకటేష్. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఐతే అనిల్ తో వెంకీ సింక్ బాగా కుదిరింది. అందుకే ఆయనతో సినిమాలు హ్యాట్రిక్ హిట్ సాధించాయి. వెంకటేష్ 77వ సినిమాగా రెండు స్క్రిప్ట్ లు రెడీ అయ్యాయట. వెంకటేష్ కూడా వాటికి సంతృప్తిగా ఉన్నాడట. కానీ ఇంకా బెటర్ మెంట్ కోసమే టైం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ చిరు సినిమా వస్తుంది. వాటితో పాటే పెద్ద సినిమాలు ఏవైనా స్లాట్ బుక్ చేసుకుంటాయి. సో వెంకీ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు.

వెంకటేష్ పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలే కానీ ఈ ఇయర్ మరో సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా వెంకటేష్ తో 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. మరి వెంకీ ఎందుకోసం వెయిట్ చేస్తున్నాడు అన్నది తెలియదు కానీ ఆలస్యం అమృతం విషం కాబట్టి అమృతం దాటి విష దాకా వెళ్లకముందే సినిమా మొదలు పెడితే బాగుంటుందని అంటున్నారు. మరి వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరి డైరెక్షన్ లో వస్తుంది. ఎలాంటి కథతో వస్తాడన్నది తెలుసుకోవాలని దగ్గుబాటి ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Tags:    

Similar News