దృశ్యం 3.. వెంకటేష్ వల్ల డైరెక్టర్ ప్లాన్ రివర్స్..?

థ్రిల్లర్ సీరీస్ లో ఫ్యామిలీ ఎమోషన్ ని మిక్స్ చేసి జీతూ జోసెఫ్ చేసే దృశ్యం సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.;

Update: 2025-11-18 14:30 GMT

థ్రిల్లర్ సీరీస్ లో ఫ్యామిలీ ఎమోషన్ ని మిక్స్ చేసి జీతూ జోసెఫ్ చేసే దృశ్యం సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సౌత్ లోనే కాదు ఈ సినిమా రీమేక్ తో నార్త్ లో కూడా దృశ్యం సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది. దృశ్యం 1, 2 సినిమాలు సక్సెస్ అవ్వడంతో పార్ట్ 3 కూడా అంతే ఉత్సాహంతో మొదలు పెట్టారు. ఐతే దృశ్యం 3ని మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. మోహన్ లాల్ తో దృశ్యం సీరీస్ లో భాగంగా 3వ పార్ట్ గా దృశ్యం 3 వస్తుంది.

దృశ్యం 3 ఒకేసారి మూడు భాషల్లో..

ఐతే ఈ మూడో పార్ట్ ని మలయాళంలో మోహన్ లాల్ తో.. తెలుగులో వెంకటేష్ తో.. హిందీలో అజయ్ దేవగన్ తో ఒకేసారి చేయాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఒకవేళ డైరెక్షన్ అతనికి కుదరకపోయినా సరే వేరే డైరెక్టర్స్ తో ఆ ప్రయత్నం చేయాలని అనుకున్నారు. ఎందుకంటే దృశ్యం 3 ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ డైరెక్టర్ ప్లాన్ ని వెంకటేష్ కాదన తప్పలేదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యే వరకు దృశ్యం 3 చేయడం కుదరదని చెప్పాడు.

కానీ దృశ్యం 3 ని అనుకున్న టైం లో పూర్తి చేసి రిలీజ్ చేయాలని జీతూ జోసెఫ్ ప్లాన్ చేసుకున్నారు. సో అతని ప్లానింగ్ కి వెంకటేష్ డేట్స్ కుదరేలా లేవని కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే షూటింగ్ మొదలు పెట్టారు. ఐతే దృశ్యం 3 సినిమా విషయంలో వెంకటేష్ కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. కాస్త లేట్ అయినా కూడా వెంకటేష్ దృశ్యం 3వ భాగం చేస్తారని అంటున్నారు.

జీతూ జోసెఫ్ కండీషన్స్..

మరోపక్క దృశ్యం పార్ట్ 3 కోసం అజయ్ దేవగన్ సొంత కథ ఒకటి తన టీం తో రాయించుకున్నారట. కానీ దృశ్యం ఫ్రాంచైజీలు తన కథతోనే రావాలని జీతూ జోసెఫ్ కండీషన్ పెట్టేసరికి ఆ ప్రయత్నాలు వదిలిపెట్టారట. మొత్తానికి జీతూ జోసెఫ్ దృశ్యం 3 వెంకటేష్ వల్ల లేట్ అవుతుంది. తెలుగు వెర్షన్ ఎప్పుడొచ్చినా సరే వెంకటేష్ చేసి తీరుతా అనేలా బజ్ ఉంది.

దృశ్యం కథను పార్ట్ 2 తో ముగించారని అప్పట్లో వార్తలు రాగా మంచి పాయింట్ రావడంతో పార్ట్ 3ని కూడా చేస్తున్నాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఐతే మరి ఈ 3వ భాగంతో అయినా సినిమా ముగిస్తాడా లేదా మళ్లీ ఇంకా కథను కొనసాగిస్తాడా అన్నది చూడాలి.

Tags:    

Similar News