పిక్‌టాక్ : బీచ్‌లో అందాల బికినీ శిల్పం
తాజాగా మరోసారి అంతా షాక్ అయ్యే విధంగా బికినీ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వేదిక వార్తల్లో నిలిచింది.;
రెండు దశాబ్దాల క్రితం తమిళ్ మూవీ 'మద్రాసి' సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వేదిక. ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అయినా, నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా వేదిక అందం ఏమాత్రం తగ్గలేదు. ఈమధ్య కాలంలో వేదిక సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదటి నుంచి అందంగా, గ్లామర్ గా కనిపిస్తూ వస్తున్న వేదిక ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా అందంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను కవ్విస్తోంది. తాజాగా మరోసారి అంతా షాక్ అయ్యే విధంగా బికినీ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వేదిక వార్తల్లో నిలిచింది.
తెలుగులో 2007లో నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి 'విజయదశమి' సినిమాతో అడుగు పెట్టిన వేదిక ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. తెలుగులో ఈమె బాలకృష్ణకు జోడీగా రూలర్ సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఈమె గత ఏడాది రజాకార్, ఫియర్ సినిమాల్లో నటించి మెప్పించింది. గత ఏడాదిలోనే ఒక తమిళ్ సినిమాను కూడా చేయడం ద్వారా గత ఏడాది బిజీ బిజీగా ఉంది. ఈ ఏడాది రెండు లేదా మూడు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే గన అనే కన్నడ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే ఏడాదిలో మరో రెండు సినిమాలతో వేదిక ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న వేదిక రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు బికినీ ఫోటోలను షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి టూ పీస్ బికినీతో బీచ్‌లో ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందాల శిల్పమా అంటూ అంతా ఆశ్చర్య పోయే విధంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.
ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం వల్లే వేదిక కి ఇంకా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అయితే స్టార్ హీరోల సినిమాలో నటించకున్నా ఈ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుని, ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవడం ఈమెకు మాత్రమే చెల్లిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన ఈమె ప్రముఖ కంపెనీకి చెందిన యాడ్స్‌లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుని సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. పలు అవార్డులను రివార్డులను, రికార్డ్‌లను సొంతం చేసుకున్న వేదిక ముందు ముందు అయినా తన అందంకు తగ్గ స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.