'బింబిసార' డైరెక్టర్ తమ్ముడు కూడా కెప్టెన్ కుర్చీ!
కుశాల్ రాజ్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ స్కై పై డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. సోమవారమే ఈసినిమా ప్రారంభమైంది. 2012 లో కృష్ణ ఇండస్ట్రీకి వచ్చాడు.;
`బింబిసార` తో మల్లిడి వశిష్ట ఎలాంటి విజయం అందుకున్నాడో తెలిసిందే. రైటర్ గా పనిచేసిన వశిష్టను కల్యాణ్ రామ్ నమ్మడంతోనే `బింబిసార` సాద్యమైంది. అప్పటికే వరుస ప్లాప్ ల్లో ఉన్న కల్యాణ్ రామ్ ని బింబిసార విజయం ఒక్కసారిగా మళ్లీ పైకి లేపింది. ఈ విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. బింబిసార కాన్సెప్ట్ కమర్శియల్ గానూ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా చేసే మెగాస్టార్ వశిష్టకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.
ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో `విశ్వంభర` భారీ అంచనాల మద్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వశిష్టకిది డైరెక్టర్ గా రెండవ సినిమా. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే? వషిష్ట కెరీర్కి తిరుగుండదు. మరో విజయం కూడా ఖాతాలో చేరితో స్టార్ డైరెక్టర్ల లీగ్లో చేరిపోతాడు. అందుకు అకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు వషిష్ట సోదరు కూడా డైరెక్టర్ అవుతున్నాడు. అతడి పేరు కృష్ణ మల్లిడి.
కుశాల్ రాజ్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ ఓ స్కై పై డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. సోమవారమే ఈసినిమా ప్రారంభమైంది. 2012 లో కృష్ణ ఇండస్ట్రీకి వచ్చాడు. అటుపై తన ప్రయాణం రకరకాల మలుపులు తిరిగిందన్నాడు. మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేసాడు. మరి ఈ కొత్త మేకర్ సినిమా ఎలా ఉంటుందన్నది చూడాలి.
సోదరుడు కూడా వశిష్ట లా తెలివైనా వాడా? కాదా? అన్నది తేలాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయా ల్సిందే. ఎలాగూ వషిష్ట సూచనలు, సలహాలు బ్యాకెండ్ లో ఉంటాయి. ఎప్పటికప్పుడు ఔట్ పుట్ చూపించి అవసరమైన మార్పులు..చేర్పులు చేసుకునే వెసులు బాటు కూడా ఉంటుంది. కాకపోతే బడ్జెట్ కాస్త పెరుగుతుంది అంతే