• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టుస్కానీలో...

టుస్కానీలో కొణిదెల-కామినేని సెలవుదినం!

| అంద‌మైన ప్రేమ ప‌క్షులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నవంబర్ -1న ఇటలీలో వివాహం చేసుకోనున్నారు. వధూవరులు ఇప్పటికే తమ అతిథులతో పాటు ఇట‌లీ టుస్కానీలో వెన్యూ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-30 04:38 GMT

అంద‌మైన ప్రేమ ప‌క్షులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నవంబర్ -1న ఇటలీలో వివాహం చేసుకోనున్నారు. వధూవరులు ఇప్పటికే తమ అతిథులతో పాటు ఇట‌లీ టుస్కానీలో వెన్యూ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ వేడుక‌కు ఇప్ప‌టికే కొణిదెల‌- కామినేని కుటుంబాలు హాజ‌ర‌య్యాయి. మెగా హీరోల్లో ప‌లువురు ఇప్ప‌టికే వేడుక‌లో సంద‌డి చేస్తున్నారు. అందుకు సంబంధించిన హింట్ గా కొన్ని ఫోటోలు వెబ్ లో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా వెన్యూ నుంచి ఓ ఫోటో అంత‌ర్జాలంలోకి రిలీజైంది.

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా రామ్ చరణ్- ఉపాస‌న దంప‌తులు తన కుటుంబంతో పాటు, అల్లు అర్జున్ అత‌డి కుటుంబం ఈ పెళ్లి వేడుకకు హాజ‌ర‌య్యారు. నితిన్ -షాలిని స‌హా చాలా మంది విమానాశ్రయంలో కనిపించారు. ఈరోజు రామ్ చరణ్ భార్య ఉపాసన టుస్కానీ నుండి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసారు. ఉపాస‌న త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసింది, ``టుస్కానీలో కొణిదెల కామినేని సెలవుదినం! హృదయమంతా ఒకే ఫ్రేమ్‌లో. ఈ చిరస్మరణీయ అనుభవానికి సాల్వటోర్ ఫెర్రాగామోకు ధన్యవాదాలు`` అని రాసారు.

ఈ ఫోటోలలో ఉపాసన, రామ్ చరణ్ వారి కుమార్తె, చిరంజీవి స‌హా కొణిదెల‌- కామినేని కుటుంబం కెమెరాకు పోజులివ్వ‌డం క‌నిపిస్తోంది. రెండవ- మూడవ ఫోటోలో రామ్ చరణ్ ఇతర సభ్యులతో పోజులిచ్చాడు. ఈ ఫోటోలను షేర్ చేసిన వెంటనే చాలా మంది అభిమానులు కామెంట్ సెక్షన్‌లో వారిని ప్రశంసించారు. చాలా మంది హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు. నిజానికి ఈ వివాహ వేడుకకు ముందు శుభ‌లేఖ ఆన్‌లైన్‌లో లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పెళ్లికి అల్లు-కొణిదెల ఫ్యామిలీ అంతా హాజర‌య్యారు. పెళ్లి అనంత‌రం రిసెప్షన్ తేదీ ఫిక్స‌యింది.

వరుణ్ - లావణ్య 2016 నుండి స్థిరమైన సంబంధంలో ఉన్నారు. జూన్ 9న లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట పెళ్లి అనంత‌రం నవంబర్ 5 న హైదరాబాద్‌లో పరిశ్రమలోని వారి స్నేహితులు, సహచరులు.. పెద్ద కుటుంబ సభ్యుల కోసం విలాసవంతమైన వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. లీకైన ఇన్విటేషన్ కార్డ్ ప్రకారం, ఈవెంట్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో జరుగుతుంది. ఈ వేడుక‌కు ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు హాజ‌రు కానున్నారు.

Tags:    
  • Varuntej 
  • Lavanyatripathi 
  • Ramcharan 
  • Upasana 
  • Chiranjeevi 
  • Nagababu 
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS