మెగా ఫ్యామిలీ.. ఈ వారసుడు ఎందుకంత స్పెషల్ అంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు;

Update: 2025-09-10 12:19 GMT

ప్రముఖ మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. బుధవారం మధ్యాహ్నం లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ సన్నిహితులు, కుటుంబసభ్యులు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.

అదే సమయంలో అభిమానులు అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. మెగా కుటుంబానికి మెగా వారసుడు వచ్చాడని పోస్టులు పెడుతున్నారు. కంగ్రాట్స్ అన్న- వదిన అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. బుల్లి వారసుడు చాలా స్పెషల్ అని అభిమానులతోపాటు నెటిజన్లు నెట్టింట చెబుతున్నారు.

అయితే నిజంగా వరుణ్, లావణ్య కుమారుడు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మెగా మూడో తరంలో ఫస్ట్ అబ్బాయి.. ఈరోజే లోకంలోకి వచ్చిన చిన్నారినే. ఇప్పటికే రెండో తరానికి చెందిన చిరు కుమార్తెలు సుస్మిత, శ్రీజలకు అమ్మాయిలే ఉన్నారు. కుమారుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా అమ్మాయి క్లీంకారకు జన్మనిచ్చారు.

కాబట్టి చిరంజీవికి ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. అలా మెగా మూడో తరంలో అబ్బాయిలు ఎవరూ ఇప్పటి వరకు లేరు. అందుకే అబ్బాయిలు ఉంటే కూడా బాగుంటుందని మెగా ఫ్యామిలీ మెంబర్స్ కొంతకాలంగా కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు లావణ్య త్రిపాఠి మగబిడ్డకు జన్మనిచ్చి అందరినీ హ్యాపీగా ఫీలయ్యేలా చేశారు.

అలా నేడు పుట్టిన కొణిదెల వారసుడు చాలా స్పెషల్ అనే చెప్పాలి. మరి ఆ చిన్నారికి ఏం పేరు పెడతారో ఆసక్తికరం. అదే సమయంలో బుజ్జి బాబుతో దిగిన పిక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగబాబు, పద్మజ దంపతులు.. నాన్నమ్మ, తాతయ్య అయిన ఆనందంలో చిన్నారితో ఫోటో దిగారు.

చిరంజీవి కూడా షూటింగ్ మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లి మూడో తరం వారసుడిని ఆశీర్వదించారు. బాబును తన చేతుల్లో ఎత్తుకుని మురిసిపోయారు. చిన్నారి రాకతో తల్లిదండ్రులుగా మారిన వరుణ్ తేజ్-లావణ్య, తాత-నాన్నమ్మగా మారిన నాగబాబు- పద్మజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అటు మెగా ప్రిన్స్ కూడా భార్య, కొడుకును హత్తుకున్న పిక్ ను పోస్ట్ చేశారు. అయితే వరుణ్, లావణ్య ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు పేరెంట్స్ గా ప్రమోషన్ పొంది.. మెగా మూడో తరానికి 'స్పెషల్' వారసుడిని ఇచ్చారు.

Tags:    

Similar News