• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్​-లావణ్య ప్రీ...

వరుణ్​-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీ.. ఎవరెవరు వచ్చారంటే..

| కాగా, 'మిస్టర్‌' సినిమా సమయంలో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి స్నేహితులయ్యారు. ఆ తర్వాత అంతరిక్షం మూవీ షూటింగ్​లో ప్రేమలో పడ్డారు

By - Tupaki Desk
Update: 2023-10-16 12:47 GMT

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు సందడి సందడి సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్​గా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అల్లు వారి నివాసంలో మరో గ్రాండ్‌ పార్టీని నిర్వహించారు. కాబోయే నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతూ ఈ పార్టీ చేశారు.


హీరో అల్లు అర్జున్‌ కుటుంబ సభ్యులు​ ఈ గ్రాండ్​ పార్టీని ఏర్పాటు చేసి గెస్ట్​లను ఆహ్వానించారు. మెగాస్టార్​ చిరంజీవి, అల్లు అరవింద్‌ ఫ్యామిలీ మెంబర్స్​తో పాటు హీరో నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు పార్టీలో సందడి చేస్తూ ఎంజాయ్ చేశారు.

దీనికి సంబంధించిన పిక్స్​ను అల్లు శిరీష్‌ సోషల్​ మీడియాలో ఎక్స్ ట్విట్టర్​లో షేర్​ చేశారు. "త్వరలో వరుణ్‌ - లావణ్య పెళ్లి జరగనున్న సందర్భంగా మా ఇంట్లో ఓ గ్రాండ్​ పార్టీ జరిగింది" అని శిరీష్​ వ్యాఖ్య రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, అభిమానులు వరుణ్​ - లావణ్యకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, 'మిస్టర్‌' సినిమా సమయంలో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి స్నేహితులయ్యారు. ఆ తర్వాత అంతరిక్షం మూవీ షూటింగ్​లో ప్రేమలో పడ్డారు. అభిరుచులు కలవడంతో రిలేషన్‌లోకి వచ్చారు. మొదట వరుణ్​ తేజ్​ ప్రపోజ్‌ చేశారు. దానికి లావణ్య ఓకే చెప్పింది. అనంతరం ఇరు కుటుంబాలు కూడా వీరి నిర్ణయాన్ని అంగీకరించాయి. నిశ్చితార్థాన్ని సింపుల్​గా చేశారు.

ఇప్పుడు పెళ్లి కూడా సింపుల్​గానే కానుంది. ఇటలీలోని టస్కాలో వీరి వివాహాం జరగనుంది. నవంబర్‌ 1వ తేదీన వీరి పెళ్లి వేడుక జరగనుందని ప్రచారం సాగుతోంది. అయినా దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇకపోతే ప్రస్తుతం వరుణ్ ​ ఆపరేషన్ వాలైంటైన్​ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    
  • Varuntej 
  • Lavanyatripathi 
  • Prewedding 
  • Megafamily 
  • Allusirish 
  • Alluarjun 
  • Destinationwedding 
  • Varun 
  • Nagababu 
  • Chiranjeevi 
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS