• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రికెటర్ కోరిక.. సూపర్‌...

క్రికెటర్ కోరిక.. సూపర్‌ స్టార్‌ కి రెడీగా ఉందట!

| నాకు సూపర్‌ స్టార్‌ విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరిక. ఆయనతో సినిమా కి స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉందని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-07-24 05:31 GMT

సాధారణంగా క్రికెటర్స్ నటులుగా ఇప్పటి వరకు కనిపించారు. కానీ తమిళనాడుకు చెందిన క్రికెటర్‌ వరుణ్ చక్రవర్తి మాత్రం తనకు దర్శకత్వం అంటే ఆసక్తి అంటున్నాడు. ఇప్పటికే పలు కథలు రాసుకున్నాను, త్వరలోనే దర్శకత్వం చేసేందుకు రెడీ అవుతున్నాను అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

వరుణ్ చక్రవర్తి ఇటీవల జరిగిన ఐపీఎల్‌ లో కేకేఆర్ తరపున ఆడాడు. కేకేఆర్‌ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒకానొక సమయంలో టీం ఇండియాలో కూడా చోటు ఛాన్స్ దక్కించుకుంటాడు అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముందు ముందు టీం ఇండియా కి వరుణ్‌ ఆడుతాడు అనే నమ్మకం ను ఆయన ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ప్రముఖ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ కోసం వరుణ్ చక్రవర్తి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ... కెరీర్ లో చాలా డ్రీమ్స్ నాకు ఉన్నాయి. ముఖ్యంగా నా ముందు రెండు గోల్స్ ఉన్నాయి. వాటిని సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను.

నాకు ఫిల్మ్‌ మేకింగ్‌ పై మొదటి నుంచి కూడా చాలా ఆసక్తి ఉంది. నా థాట్స్‌ కి ఫిల్మ్‌ మేకింగ్‌ సరిగ్గా సెట్‌ అవుతుంది. అందుకే నేను భవిష్యత్తులో ఫిల్మ్‌ మేకింగ్‌ వైపు వెళ్లాలి అనుకుంటాను. అందుకే ఇప్పటికే కథలు రాస్తూ ఉన్నాను. స్క్రిప్ట్‌ రైటింగ్‌ మెలుకువలు నేర్చుకున్నాను.

నాకు సూపర్‌ స్టార్‌ విజయ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరిక. ఆయనతో సినిమా కి స్క్రిప్ట్‌ కూడా రెడీగా ఉందని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కనుక విజయ్ కోరిక తీరడం కష్టమే అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ గోట్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. మరో సినిమాకు కూడా విజయ్ ఓకే చెప్పాడు. ఆ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Varunchakraborthy 
  • Cricketer 
  • Ipl 
  • Kkr 
  • Ravichandranashwin 
  • Filmcarrer 
  • Director 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS