• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్ తేజ్.. ఈసారి మామూలు...

వరుణ్ తేజ్.. ఈసారి మామూలు హిట్టు సరిపోదు!

| మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-21 05:30 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ సిద్ధం అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మూవీ ఉంది. భారీ బడ్జెట్ తో రజిని తాళ్లూరి, విజయ్ కుమార్ తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు కరుణ కుమార్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్ కి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే తరువాత రిలీజ్ అయిన సాంగ్ ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు. ‘మట్కా’ సినిమా పైన వరుణ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ లుక్స్ లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. 3 టైమ్ పీరియడ్స్ లో మామూలు రౌడీ నుంచి ‘మట్కా’ కింగ్ గా వరుణ్ తేజ్ ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కి ఈ సినిమాతో సక్సెస్ చాలా అవసరం అని చెప్పాలి. వరుణ్ తేజ్ నుంచి చివరిగా వచ్చిన ‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారాయి. భారీ బడ్జెట్ లతో తెరకెక్కిన ఈ సినిమాలు చాలా తక్కువ కలెక్షన్స్ సాధించాయి. బ్రేక్ ఈవెన్ లో సగం కూడా అందుకోలేదు. ఈ సినిమాల ప్రభావంతో వరుణ్ తేజ్ మార్కెట్ కూడా డ్రాప్ అయిపొయింది. అయితే ‘మట్కా’ మూవీ మరల తనని మార్కెట్ లో స్ట్రాంగ్ గా నిలబెడుతుందని వరుణ్ తేజ్ అనుకుంటున్నారు.

ఎదో మామూలు హిట్ కొడితే సరిపోదు. స్ట్రాంగ్ గా డబుల్ ప్రాఫిట్స్ అంధించి తన స్టార్ ఇమేజ్ ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అందరికి కనెక్ట్ అయ్యే మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో వస్తోన్న చిత్రం కావడంతో మూవీపైన కొంత బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ బజ్ అతనికి భారీ ఓపెనింగ్స్ ని తీసుకొచ్చే రేంజ్ లో లేదని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. కనీసం మెగా ఫ్యాన్స్ దృష్టిని కూడా ఈ మూవీ ఆకర్షించలేదని కొంతమంది అంటున్నారు. మరో వైపు నవంబర్ 14న కోలీవుడ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువా’ రిలీజ్ అవుతోంది.

ఆ సినిమాని తట్టుకొని ‘మట్కా’ ఎంత వరకు నిలబడుతుందనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ‘కంగువా’ మూవీ పైన భారీ హైప్ నెలకొని ఉంది. ఇది కోలీవుడ్ ఇండస్ట్రీకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. తమిళనాట ‘కంగువా’ ని కాదని ‘మట్కా’ ని ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉండదని సినీ విశ్లేషకుల మాట. ఈ ప్రతికూలతని తట్టుకొని వరుణ్ తేజ్ బాక్సాఫీస్ పరీక్షలో ఈ సారి పాస్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Tags:    
  • Matkamovie 
  • Varuntej 
  • Meenakshichowdary 
  • Gvprakash 
  • Norafatehi 
  • Kanguvamovie 
  • Operationvalentine 
  • Ghanimovie 

Similar News

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS