కొణిదెల మెగా వారసుడి పేరు ఫిక్స్!
ఈ సందర్భంగా వరుణ్ లావణ్య ఒక ప్రత్యేక ఫొటో షూట్ చేశారు. అందులో వరుణ్ తేజ్ తన కుమారుడిని ముద్దాడుతుండగా, లావణ్య త్రిపాఠి తన పాపను ప్రేమగా తాకుతూ కనిపించారు.;
మెగా ఫ్యామిలీకి కొత్త ఆనందం కలిగించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు గత నెల 10న పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత మెగా అభిమానులు సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నింపేశారు. అయితే, తమ చిన్నారికి ఏ పేరు పెట్టబోతున్నారో అన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొని ఉంది. చివరికి ఆ ఆసక్తికి దసరా పండుగ రోజు ముగింపు పలికారు ఈ స్టార్ జంట.
కొణిదెల వారసుడి పేరును వాయువ్ తేజ్ అని ప్రకటించారు. ఈ పేరు సింపుల్ గా అనిపించినా, ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మికత, బలం ప్రత్యేకం. వాయువ్ అనే పదం గాలి అనే అర్థాన్ని కలిగిస్తూనే.. జీవానికి, శక్తికి ప్రతీక. అంతేకాదు, ఈ పేరు భగవంతుడైన హనుమంతుడి పేరును గుర్తు చేస్తుంది. అద్భుతమైన బలం, భక్తి, ధైర్యం, ఆధ్యాత్మిక కాంతిని సూచించేలా ఈ పేరును ఎంచుకోవడం విశేషం.
ఈ పేరును ప్రకటించగానే అభిమానుల మధ్య ఆనందం వెల్లివిరిసింది. మెగా లెగసీకి తగ్గట్టే పేరు పెట్టారు చాలా పవర్‌ఫుల్‌గా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెగా అభిమానులు మాత్రమే కాకుండా, సినీ వర్గాలవారు కూడా ఈ బేబీ బాయ్ పేరును ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు అందిస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే అభిమానుల మన్ననలు అందుకోవడం, అతని భవిష్యత్తు గురించి ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ సందర్భంగా వరుణ్ లావణ్య ఒక ప్రత్యేక ఫొటో షూట్ చేశారు. అందులో వరుణ్ తేజ్ తన కుమారుడిని ముద్దాడుతుండగా, లావణ్య త్రిపాఠి తన పాపను ప్రేమగా తాకుతూ కనిపించారు. ఈ ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ మూడ్‌లో విడుదల కావడంతో మరింత ఎమోషనల్‌గా అనిపిస్తున్నాయి. బిడ్డ ముఖాన్ని మాత్రం దాచిపెట్టారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో బేబీని కౌగిలించుకుని ఉన్న ఫోటో షేర్ చేశారు. కొణిదెల కుటుంబానికి కొత్త సభ్యుడు వచ్చాడు. మన చిన్నారి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటూ బ్లెసింగ్స్ ఇచ్చారు. అలాగే కొణిదెల కుటుంబంలో ఇప్పటివరకు ఈ తరంలో అబ్బాయిలు లేరు. అందుకే వాయువ్ జననం వారికి మరింత ఆనందాన్ని కలిగిస్తోందని నెటిజన్లు స్పందిస్తున్నారు.