కొరియన్ కనకరాజు టీమ్ పార్టీలే పార్టీలు
నాన్-స్టాప్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలోకి వచ్చిన `కొరియన్ కనకరాజు` చిత్రం మైండ్ బ్లాకింగ్ మోమెంటమ్‌తో గ్రాండ్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది.
నాన్-స్టాప్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలోకి వచ్చిన `కొరియన్ కనకరాజు` చిత్రం మైండ్ బ్లాకింగ్ మోమెంటమ్‌తో గ్రాండ్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ హారర్-కామెడీ చిత్రానికి ప్రీ-రిలీజ్ నుంచే భారీ హైప్ లభించగా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రేక్షకుల భారీ అంచనాలను స్పష్టంగా చూపించాయి. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ `సిటాడెల్` వేదికగా గ్రాండ్ బ్లాక్‌బస్టర్ పార్టీని నిర్వహించింది.
ఈ వేడుకలో `కొరియన్ కనకరాజు` మూవీ టీమ్‌తో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర నటీనటులు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు సందడి చేశారు. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, స్టార్ డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్, వసిష్ఠ, ప్రముఖ నిర్మాతలు శిరీష్, మైత్రి రవి, సాహు గారపాటి, నాగవంశీ, ఎస్‌కేఎన్ తదితరులు ఈ పార్టీకి హాజరై చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. చిత్రబృందం అందరూ కలిసి ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఫుల్‌గా ఆస్వాధిస్తూ చిల్ అయ్యారు.
విడుదలకు ముందు చివరి 24 గంటల్లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం ప్రముఖ బుకింగ్ యాప్ బుక్‌మైషోలోనే ఏకంగా 33 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడై సేల్స్‌లో భారీ జంప్‌ను నమోదు చేశాయి. అంతకంటే ముందుగానే ప్రదర్శించిన పెయిడ్ ప్రిమియర్ షోలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడమే కాకుండా.. దాదాపు అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమయ్యాయి. వినోదానికి ప్రాధాన్యమిచ్చిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాకి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ లభించింది.
ఈ రకమైన క్రేజీ ఓపెనింగ్స్ , పాజిటివ్ టాక్‌తో `కొరియన్ కనకరాజు` థియేట్రికల్ రన్‌లో అత్యంత బలంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇతర పెద్ద సినిమాల పోటీ ఏదీ లేకపోవడంతో ఈ వీకెండ్‌లో థియేటర్లలో అత్యధిక ఆక్యుపెన్సీలతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా వీకెండ్ కలెక్షన్ల విషయంలో చాలా ధీమాగా ఉన్నాయి.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ కథానాయికగా నటించగా సత్య, మురళీధర్ గౌడ్, అవసరాల శ్రీనివాస్, చిన్న తదితరులు కీలక పాత్రల్లో కనిపించి నవ్వుల పూయించారు. యూవీ క్రియేషన్స్- ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రిలీజైన రోజే కనకరాజు పార్టీల వెనక కారణం ఏంటో అర్థమైంది కదా!