డెబ్యూ నటిపై జెలసీ.. దొరికిపోయిన హీరో!
అనీత్ పద్దాను బాడీ షేమ్ చేస్తూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వీడియో కామెంట్లలో వరుణ్ ధావన్ `లైక్` గందరగోళానికి దారితీసింది;
ఒక వర్థమాన నటి ఓవర్ నైట్ స్టార్‌గా వెలిగిపోవడం అంతగా సక్సెస్ లేని వరుణ్ ధావన్ కి నచ్చలేదా? అతడు డెబ్యూ నటి విషయంలో జెలసీ ఫీలయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాల్లో సాగుతున్న బిగ్ డిబేట్ ఇది. సైయారా నటి అనీత్ పద్దా ఏదో ఫ్లూక్‌లో స్టార్ అయిందని, అసలు హీరోయిన్ కాలేదనే అర్థం వచ్చిన ఓ క్రూరమైన ఆన్ లైన్ వ్యాఖ్యకు మద్ధతిస్తూ వరుణ్ ధావన్ లైక్ చూసాడని కథనాలొస్తున్నాయి. అనీత్ పద్దా సక్సెస్ పార్టీ అనంతరం విమానాశ్రయం నుంచి వెళుతూ కెమెరాలకు ఫోజులివ్వడానికి నిరాకరించిన వీడియోను పోస్ట్ చేసిన కేఆర్కే అప్పుడే డ్రామా షురూ చేసింది! అంటూ క్రిటిసైజ్ చేసాడు. అనీత్ పద్దాను బాడీ షేమ్ చేస్తూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వీడియో కామెంట్లలో వరుణ్ ధావన్ `లైక్` గందరగోళానికి దారితీసింది.
అక్కసు వెల్లగక్కాడా?
ఇది నిజమే.. `సైయారా` నటి విజయాన్ని వరుణ్ జీర్ణించుకోలేకపోతున్నాడు! అంటూ పెద్ద చర్చ సాగుతోంది. నిజానికి సైయారా చిత్రంలో మొదట వరుణ్ ధావన్ ని మోహిత్ సూరి కథానాయకుడిగా ఎంపిక చేసుకోగా, ఆ పాత్రకు ఒక డెబ్యూ నటుడు సరిపోతాడని యష్ రాజ్ ఫిలింస్ మార్పులు చేసిందని కూడా గుసగుసలు వినిపించాయి. ఇంత పెద్ద విజయం సాధించిన సినిమా తన చేజారింది. అందుకే ఇప్పుడిలా వరుణ్ జెలసీ ఫీల్ అయ్యి కక్ష తీర్చుకున్నాడంటూ కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక ప్రారంభ నటిపై వరుణ్ లాంటి పెద్ద స్టార్ కి ఇంత అక్కసు అవసరమా? ఇది చిన్న పిల్లాడి మనస్తత్వానికి అద్దం పడుతుంది! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆ ఇద్దరూ ధృవీకరించలేదు:
అయితే ఇది నిజం కాదు.. వరుణ్ ధావన్ అలా చేయడని, డిజిటల్ యుగంలో తప్పుడు ప్రచారానికి ఆస్కారం ఉందని కూడా ఒక సెక్షన్ జనం ఖండిస్తున్నారు. వరుణ్ ధావన్ కానీ, కేఆర్కే కానీ ఆ పోస్ట్ గురించి అధికారికంగా ధృవీకరించలేదని, ఇలాంటివి ఏఐలో చాలా పుట్టిస్తున్నారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సైయారా చిత్రం విజయాన్ని, నటీనటుల ప్రదర్శనను వరుణ్ ప్రశంసించాడని కూడా అతడి అభిమానులు చెబుతున్నారు. వరుణ్ బాడీ షేమింగ్ ని ఎంకరేజ్ చేయడని మద్ధతునిస్తున్నారు.
వీటిని నమ్మకూడదు:
వరుణ్ ఇన్‌స్టాలో కెఆర్‌కెను అనుసరించలేదు.. అందుకే, `లైక్` అనేది ఆశ్చర్యకరంగా ఉంది. కొందరు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని లేదా ఆటోమేషన్ ద్వారా జరిగిందని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో షేర్ అయ్యే ఇలాంటి స్క్రీన్‌షాట్‌లను పూర్తిగా ప్రామాణీకంగా తీసుకోలేమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ- అవ్ నీత్ కౌర్ వ్యవహారంలో డిజిటల్ ప్రొపగండా ఇలానే కొనసాగిందని కొందరు ఉదహరిస్తున్నారు. ఇందులో నిజం ఎంతో చెప్పలేమని కూడా కొందరు అంటున్నారు.
350 కోట్ల వసూళ్లు:
సైయారా చిత్రం మొదటి రోజు 21కోట్ల కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది చావా తరవాత బాలీవుడ్ లో అతిపెద్ద హిట్ చిత్రంగా సైయారా పేరు మార్మోగుతోంది.
వాణి పాత్రతో మెరిపించింది:
అనీత్ పద్దా సలాం వెంకీ (2022) చిత్రంతో అరంగేట్రం చేసింది. బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (2024)లో తన నటనకు ప్రశంసలు అందుకుంది. `సైయారా`లో వాణి పాత్రలో అద్భుతంగా నటించింది అంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా డెబ్యూ తారలు అనీత్ పద్దా, అహాన్ పాండేకు ఓవర్ నైట్ క్రేజ్ ను తెచ్చింది.